‘నీ రాకతో అన్నీ మారిపోయాయి’ | Smriti Irani Shares Adorable Photos On Daughter Birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే జో..లవ్‌ యూ: స్మృతి ఇరానీ

Sep 23 2019 4:34 PM | Updated on Sep 23 2019 4:51 PM

Smriti Irani Shares Adorable Photos On Daughter Birthday - Sakshi

‘పదహారేళ్ల క్రితం నువ్వు మా జీవితాల్లోకి వచ్చావు. నీ రాకతో అన్నీ మారిపోయాయి. నువ్వున్న చోట ఆనందం వెల్లివిరుస్తూనే ఉంటుంది. నీ చేతి మృదువైన స్పర్శ నాలో శాంతిని, స్థిరత్వాన్ని నింపింది. నేటికీ నాకు ఎదురయ్యే ప్రతీ సవాలులో అది తోడుగా నిలుస్తోంది. నువ్వు మా జీవితాల్లో ఉండటం వల్ల ఆ దేవుడి ఆశీర్వాదాలు మాకు లభించాయని ఎంతో సంతోషిస్తాం. హ్యాపీ బర్త్‌డే జో. కలకాలం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన గారాల పట్టి జోయిష్‌ ఇరానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో స్మృతి పోస్ట్‌ చేసిన జోయిష్‌ చిన్ననాటి ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా జోయిష్‌ ఇరానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సందేశాత్మక పోస్టులతో పాటు ఫన్నీ కామెంట్స్‌తో అభిమానులను అలరించే స్మృతి..ట్రోలర్స్‌కు సైతం ఘాటుగానే సమాధానమిస్తారు. గతంలో తన కూతురిని కించపరిచేలా మాట్లాడిన ఆమె క్లాస్‌మేట్‌కు స్మృతి ఇన్‌స్టా వేదికగా బుద్ధిచెప్పారు. తాను పోస్ట్‌ చేసిన సెల్ఫీలో జోయిష్‌ ఇరానీ అందవిహీనంగా ఉందన్న అతడి కామెంట్లపై స్పందించిన స్మృతి.. ‘నా కుమార్తె క్రీడాకారిణి, లిమ్కా బుక్స్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించింది. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకుంది. తను నా ముద్దుల తనయ. ఎంతో అందంగా ఉంటుంది. తనను ఎంతగా ఏడిపిస్తారో ఏడిపించండి. మీ అందరికి దీటుగా బదులిస్తుంది. ఎందుకంటే తను జోయిష్‌ ఇరానీ. ఆమె తల్లినైనందుకు గర్విస్తున్నా’ అని కూతురి విజయాలను ప్రస్తావించి అతడి నోరు మూయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement