పిడుగుపాటుకు గురై 22 మంది మృత్యువాత‌

22 Casualties Due To Thunderstorms In Bihar In 24 hrs  - Sakshi

పాట్నా : బిహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో పిడుగుపాటుకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది.

రానున్న  మూడు రోజుల్లో అస్సాం, మేఘాల‌య‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, బిహార్‌, ప‌శ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోయే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త ఆర్కె జెన‌మ‌ని అన్నారు. భారీ వ‌ర్ష సూచ‌న నేప‌థ్యంలో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు.
(పెరిగిన అసోం వరదల మృతులు )

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top