ఒక దైవరహస్యం

vineet chandra devyani sharma new movie tuniga - Sakshi

వినీత్‌ చంద్ర, దేవయానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘తూనీగ’. ‘ఒక దైవరహస్యం’ అనేది ఉపశీర్షిక. సుప్రీత్‌ దర్శకత్వం వహించారు. ప్రేమ్‌ పెయింటింగ్స్‌పై క్రౌడ్‌ ఫండింగ్‌ విధానంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘పుట్టిన ప్రతి ప్రాణి.. జీవించే ప్రతి జీవం... కారణమైన ఆ దైవం’, ‘చరిత్ర చెరిపిన కథను వినదగువారెవ్వరూ!’, ‘కనుమరుగైన ఆ దైవరహస్యాన్ని చెప్పేది ఎవరు?’ అని ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్‌ ఆసక్తి కరంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌  సదాశివుని, కెమెరా: హరీశ్‌ ఈడిగ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top