సుధీర్ బాబు 'జటాధర'.. మరో ఇంట్రెస్టింగ్ లుక్ | Sudheer Babu Jatadhara Movie Latest Look | Sakshi
Sakshi News home page

Jatadhara Movie: సుధీర్ బాబు 'జటాధర'.. మరో ఇంట్రెస్టింగ్ లుక్

Sep 24 2024 6:57 PM | Updated on Sep 24 2024 6:57 PM

Sudheer Babu Jatadhara Movie Latest Look

సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'జటాధర'. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పోస్ట్ రిలీజ్ చేశారు. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్‌ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుందని ప్రకటించారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: అభయ్ ఎలిమినేట్ అయ్యాడుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?)

వచ్చే ఏడాది శివ‌రాత్రికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పౌరాణిక‌, ఫాంట‌సీ, డ్రామా అంశాల కాంబోలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త లుక్‌లో సుధీర్ బాబు స‌రికొత్తగా, శ‌క్తివంత‌ంగా కనిపిస్తున్నాడు. ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో'.. అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!)

Advertisement
 
Advertisement
Advertisement