తన బీస్ట్‌ను పరిచయం చేసిన బన్నీ | Sakshi
Sakshi News home page

తన బీస్ట్‌ను పరిచయం చేసిన బన్నీ

Published Sun, Aug 25 2019 12:17 PM

Stylish Star Allu Arjun Names his New Range Rover BEAST - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇటీవల భారీ ఖర్చుతో కార్‌వాన్‌ను డిజైన్‌ చేయించుకున్న అల్లు అర్జున్ తాజాగా మరో లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. అభిమానుల కోసం తన కొత్త కారుతో తను దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ‘ఇంట్లో కొత్త కారు. దీనికి నేను బీస్ట్‌ అని పేరు పెట్టాను. నేను ఏదైన కొన్న ప్రతిసారి నాకు కృతజ్ఞత భావనే కలుగుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమాలో  నటిస్తున్నాడు బన్నీ. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, నవదీప్‌, టబు, జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement