రవితేజ ‘నెక్స్ట్‌’.. రచ్చ కాకూడదనే! | Ravi Teja Next Tweet on Pawan Deleted | Sakshi
Sakshi News home page

Feb 2 2018 4:16 PM | Updated on Mar 22 2019 5:33 PM

Ravi Teja Next Tweet on Pawan Deleted - Sakshi

సాక్షి, సినిమా : మాస్‌ మహారాజ్‌ రవితేజ చేసిన ఓ పని సోషల్‌ మీడియాలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. తాజా చిత్రం టచ్‌ చేసి చూడు ప్రమోషన్‌లో భాగంగా గురువారం రవితేజ అభిమానులతో ట్విటర్‌లో చిట్‌ ఛాట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మాస్‌ రాజా సమాధానం ఇవ్వటం... వెంటనే దానిని తొలగించటం చర్చనీయాంశమైంది.

పవన్‌ కళ్యాణ్‌ గురించి ‘ఒక్క ముక్కలో’ చెప్పండంటూ ఓ పవన్‌ వీరాభిమాని రవితేజను కోరాడు. దీనికి వెంటనే రవితేజ ‘నెక్స్ట్‌’ అంటూ బదులిచ్చి మరో ప్రశ్నకు వెళ్లిపోయాడు. అయితే తర్వాత ఏమైందో తెలీదుగానీ ఆ ట్వీట్‌ను మాస్‌ రాజా తొలగించేశాడు. కానీ, అప్పటికే కొందరు ఆ ట్వీట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటం ప్రారంభించేశారు. 

వివాదాస్పదం కావటం ఇష్టం లేకనే రవితేజ ఆ ట్వీట్‌ను తొలగించినప్పటికీ.. ముందే అలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండాల్సిందని పలువురు విమర్శిస్తున్నారు. మరికొందరేమో మాస్‌ రాజాకు మద్ధతుగా.. అది కాకతాళీయంగా జరిగిపోయిందని.. అప్పట్లో ఓ టీవీషోలో మల్టీస్టారర్‌ పవన్‌తోనే చేస్తానన్న రవితేజ కామెంట్లను ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో స్పందించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలన్న విషయం మరోసారి రుజువైంది. అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా!

Advertisement
 
Advertisement
Advertisement