 
													తమిళ స్టార్ హీరో, తలైవా రజనీకాంత్ అల్లుడు ధనుష్ తాజా సినిమా ‘అసురన్’పై సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. అసురన్ వాస్తవికతకు దగ్గరగా ఉందని.. ప్రతీ అంశాన్ని లోతుగా స్పృశించిందని కితాబిచ్చారు. సినిమా చాలా బాగుందని మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా తమిళ నవల ఆధారంగా వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

భూ తగాదా నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేశారు. మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్‌గా కనిపించారు. ఇక విలక్షణ నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ సేతుపతి సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబరు 4న విడుదలైంది.
Asuran...raw real and intense... Cinema at its best👌Congratulations @dhanushkraja @VetriMaaran @prakashraaj @gvprakash @theVcreations @VelrajR and entire team #Asuran
— Mahesh Babu (@urstrulyMahesh) October 20, 2019

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
