మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

Kangana Ranaut turns chef Celebrates Narendra Modi victory with Chai and Pakoras - Sakshi

బీజేపీ బిగ్‌ విక్టరీపై బాలీవుడ్‌ హీరోయిన్‌  కంగనా రనౌత్‌  హృదయపూర్వక అభినందనలు  తెలిపారు. 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నుంచి తిరిగి వచ్చిన బాలీవుడ్‌  క్వీన్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా సెలబ్రేట్‌ చేసుకున్నారట. బీజేపీ  సాధించిన అద్భుతమైన విజయంపై  ఫుల్‌ హ్యాపీగా ఉన్న కంగనా  చెఫ్‌ అవతార మెత్తారట.  ఈ విషాయాన్ని కంగనా సోదరి రంగోలి చందేల్  సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

కంగనా వంటలు చాలా అరుదుగా చేస్తుంది..ఎంతో సంతోషంగా ఉంటే తప్ప..కానీ రుచిరకరమైన పకోడీలు, కాఫీ  వడ్డించి  2019 లోక్‌సభ ఎన్నికల్లో  మోదీ చారిత్రాత్మక విజయంపై సంతోషాన్ని వ్యక్తం  చేసిందని రంగోలి పేర్కొన్నారు.  జై హింద్‌.. జైభారత్‌ అంటూ ట్విటర్‌లో కొన్ని ఫోటోలను ఆమె షేర్‌ చేశారు. అలాగే తమ జనరేషన్‌లో నరేంద్రమోదీలాంటి నాయకుడిని  పొందడం అదృష్టమంటూ రంగోలి చందేల్ కూడా మోదీకి అభినందలు తెలిపారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top