
ముంబై: ఎప్పుడూ ఏదో ఒక సీరియస్ అంశం మీద గళమెత్తే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్.. ‘నేను ఏ లుక్‌లో బాగున్నానో చెప్పండి’ అంటూ సరదాగా అభిమానులను పలకరించారు. తాను నటించిన.. ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా కోసం నిర్వహించిన లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ మేరకు.. ‘‘మీరు మనుపెన్నడూ చూడని, తిరస్కరణకు గురైన లుక్. జడ్జిమెంటల్ హై క్యా సినిమా కోసం చేసిన లుక్‌టెస్ట్. మీరేం అనుకుంటున్నారు? ఆమె పిక్సీ కట్‌తో బాగుందా లేదా సినిమాలో కనిపించినట్లుగా.. గుబురైన ఉంగరాల జుట్టుతో బాగుందా? కింద కామెంట్ చేయండి’’ అని కంగన తరఫున ఆమె టీం రెండు ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (మరోసారి తెరపైకి కంగనా!)
ఇక ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం నాలుగు గంటల్లోనే 7 లక్షలకు పైగా లైకులు సంపాదించాయి. అన్నట్లు చాలా మంది ఉంగరాల జుట్టు ఉన్న కంగన ఫొటోకే ఓటేస్తున్నారు. ‘‘ఇలాంటి సహజమైన లుక్‌లోనే చూసేందుకు మేం ఎల్లప్పుడూ ఇష్టపడతాం మేడం. ఆ జుట్టే మీకు అందం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇతరులతో పోల్చుకుంటూ మానసికంగా ఇబ్బంది పడేవారు.. బాధతో కుమిలిపోకుండా.. ‘‘ఎవరి ఇండివిడ్యువాలిటీని వారు ఎంజాయ్ చేయాలి. ఎవరి జీవితాన్ని వాళ్లు ఓ పండుగలా చేసుకోవాలి’’ అనే కాన్సెప్ట్‌తో ‘జడ్జిమెంటల్ హై క్యా’ను తెరకెక్కించారు. ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మించారు. ఇందులో కంగనతో పాటు రాజ్‌కుమార్ రావ్ కీలక పాత్రలో కనిపించాడు. ఇక వివిధ సామాజిక అంశాలపై బలంగా గొంతు వినిపించే కంగన.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సినీ పెద్దలు, బంధుప్రీతిపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..)