నేను ఆరోగ్యంగా ఉన్నాను | i am fine comedian goundamani | Sakshi
Sakshi News home page

నేను ఆరోగ్యంగా ఉన్నాను

Sep 19 2016 2:02 AM | Updated on Sep 4 2017 2:01 PM

నేను ఆరోగ్యంగా ఉన్నాను

నేను ఆరోగ్యంగా ఉన్నాను

ఇటీవల అసత్య ప్రచారాలు అధికం అవడంతో పాటు సంబంధిత వ్యక్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.


 తమిళసినిమా: ఇటీవల అసత్య ప్రచారాలు అధికం అవడంతో పాటు సంబంధిత వ్యక్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా సీనియర్ హాస్యనటుడు గౌండమణి విషయంలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. కమెడియన్‌గా అశేష ప్రేక్షకులను అలరించిన గౌండమణి తాజాగా హీరోగానూ నటిస్తున్నారు. ఆయన నటించిన ఎనక్కు వేరెంగుం కిళైగళ్ ఇల్లై చిత్రం విడుదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో గౌండమణి ఆనారోగ్యానికి గురయ్యార ని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారాన్ని మీడియా ఊదరగొట్టింది.

 దీంతో ఆయన తాను ఆరోగ్యంగానే ఉన్నానని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన  తన పీఆర్‌ఓ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ తన గురించి వదంతులు ప్రచారం చేసిన వ్యక్తి ఏవరో గానీ తద్వారా అతనికి కలిగే ఫలితం ఏమిటో తెలియలేదన్నారు. సమీప కాలంలో ప్రఖ్యాత నటి కేఆర్.విజయ గురించి కూడా ఇలాంటి వదంతులే ప్రచారం అయ్యాయని గుర్తు చేశారు.

తాను నిక్షేపంగా ఉన్నాననీ, తన తదుపరి చిత్రం గురించి కథా చర్చల్లో పాల్గొంటున్నానని, త్వరలోనే ఆ చిత్రం గురించిన వివరాలను వెల్లడిస్తానని గౌండమణి తెలిపారు. అదే విధంగా తన తాజా చిత్ర ప్రారంభం కార్యక్రమంలో మీడియా సోదరులందరిని కలుసుకుంటానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement