‘శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేశారు’

Anil Kapoor Shares Old Photo With Sridevi And Thanks Steve McCurry - Sakshi

సాక్షి, ముంబై:  కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితయ్యారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అనిల్‌ కపూర్‌ ఓ త్రో బ్యాక్‌(పాత) ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోకు.. ‘షూటింట్‌ సమయంలో నన్ను ఫోటో తీసినట్లు  నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. నన్ను, శ్రీదేవిని ఫోటోలో బంధించినందకు కృతజ్ఞతలు, శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను తిరిగి తెచ్చినందుకు మీకు (స్టీవ్‌ మెక్‌కరీ) ధన్యవాదాలు’ అంటూ ఆయన కామెంట్‌ జతచేశారు.

అనిల్‌ కపూర్‌, అందల నటి శ్రీదేవి కలిసి 1994లో నటించిన ‘లాడ్ల’ సినిమా షూటింగ్‌ సందర్భంగా ప్రముఖ అమెరికన్‌ సినిమాటోగ్రఫర్‌ స్టీవ్ మెక్‌కరీ ఈ ఫోటోను తీశారు. ఈ ఫోటోలో అనిల్‌ కపూర్‌ శ్రీదేవిని తన భుజాలపై ఎత్తుకుంటే.. అదే సమయంలో శ్రీదేవి అద్దంలో చూస్తూ తన మేకప్‌ ఎలా ఉందో గమనిస్తోంది. (లాక్‌ డౌన్‌లో ప్రయోగం)

మొదట అనిల్‌కపూర్‌కు సంబంధించిన ఈ‌ త్రో బ్యాక్‌ ఫోటోను అమెరికన్‌ సినిమాటోగ్రఫర్‌ స్టీవ్ మెక్‌కరీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అది చూసిన అనిల్‌ కపూర్‌ తన ట్విటర్‌ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఈ ఫోటోలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 70 ఏళ్ల స్టీవ్‌ మెక్‌కరీ బాలీవుడ్‌లో తాను పనిచేసిన సినిమాల్లో నటించిన నటీనటుల పాత ఫోటోలను సోషల్‌ మీడియా పోస్ట్‌ చేస్తూ ఆనాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  (చిన్న విరామం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top