
న్యూయార్క్: సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అమెరికా చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో సైన్యంతో పాటు సైనిక జాగిలాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన శునకం (కే9) ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది. అయితే ఉగ్రవాదులను వేటాడటానికి ఆ కుక్కకు అమెరికా సైన్యాలు ఇస్తున్న ట్రైనింగ్ చూస్తే షాకవ్వక తప్పదు. బాగ్దాది హతం అనంతరం ఆ కుక్కపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా సైన్యం ఆ కుక్కు చేసే సైనిక విన్యాసాల వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేసింది. వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది.
Belgian Malinois.. The breed of dogs used by US special forces... To track and kill Baghdadi. pic.twitter.com/QeJzB31Xuc
— Archie{Col Vijay S Acharya(R)} (@archie65) November 2, 2019