మిస్‌ యూనివర్స్‌గా జోజిబినీ తుంజీ

Miss Universe 2019 Winner Is Miss South Africa - Sakshi

అట్లాంటా: ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్‌ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలోని టైలర్‌ పెర్రీ స్టూడియోస్‌లో జరిగిన ఈ అందాల పోటీలకు పాపులర్‌ టీవీ పర్సనాలిటీ స్టీవ్‌ హార్వే హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఏడుగురు మహిళలతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. ఫైనల్‌లో ప్యూర్టో రికన్‌, మెక్సికన్‌ భామలను వెనక్కి నెట్టి జోజిబినీ తుంజీ విజేతగా నిలిచినట్లు వారు ప్రకటించారు. 

ఈ క్రమంలో తుంజీ మాట్లాడుతూ... ‘అచ్చం నాలాగే కనిపించే మహిళలు ఉన్న ప్రపంచలో నేను పెరిగాను. వారిది కూడా నాలాంటి శరీర వర్ణమే. శిరోజాలు కూడా నా వంటివే. అయితే మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ సౌందర్యరాశులుగా పరిగణించలేదు. నేటి నుంచి ఆ భావన తొలగిపోతుందనుకుంటున్నా. అలా అనుకునే వాళ్లు నా ముఖం చూడండి. నా ముఖంలో ప్రతిబింబిస్తున్న మీ ముఖాలు చూసుకోండి’ అని తన దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపారు. అనంతరం మిస్‌ యూనివర్స్‌-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్స్‌) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించగా.. తుంజీ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇంకా చేయాల్సి చాలా ఉంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top