పోలీస్‌ స్టేషన్‌లోనే వ్యక్తిని చితకబాదిన కాంగ్రెస్‌ నాయకుడు

Tripura Congress Chief  Slaps Man In Police Station For Hitting His Sister - Sakshi

అగర్తల : పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ వ్యక్తిపై దాడికి దిగాడు త్రిపుర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రద్యోత్‌ కిషోర్‌ దేవ్‌ బర్మాన్‌. వివరాలు.. ప్రద్యోత్‌ కిషోర్‌ సోదరి ప్రగ్యా దేవ్‌ బర్మాన్‌ త్రిపుర కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రగ్యా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఓ వ్యక్తి ఇటుకతో ఆమె కాన్వాయ్‌ మీద దాడి చేశాడు. దాంతో కార్యకర్తలు ఆ వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొచ్చారు.

సమాచారం తెలుసుకున్న ప్రద్యోత్‌ కిషోర్‌ పోలీస్‌ స్టేషన్‌కెళ్లి తన సోదరి మీద దాడి చేసిన వ్యక్తిని చితకబాదాడు. ఈ సంఘటన గురించి అతను మాట్లాడుతూ.. ‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి మా సోదరి మీద ఇటుకతో దాడి చేశాడు. ఏ మాత్రం తేడా వచ్చినా తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేది. తనను ఆ పరిస్థితుల్లో చూస్తే నాకు కోపం ఆగలేదు. అందుకే ఓ అన్నగా.. బాధ్యాతయుతమైన త్రిపుర పౌరుడిగా స్పందించి ఆ వ్యక్తిని కొట్టాను. ఇందుకు నా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేద’ని తెలిపాడు. పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ వ్యక్తిమీద దాడి చేయడంతో ప్రద్యోత్‌ కిషోర్‌ మీద కూడా ఎఫ్ఐఆర్‌ నమోదయ్యింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top