
ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ ఖూనీ చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో దిగజారిన శాంతి భద్రతలపై శనివారం శాసనసభలో జరిగిన చర్చ హే యమైన రీతిలో సాగిందని.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షం గొంతును నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
శాంతిభద్రతలపై చర్చ హేయంగా మారింది: ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ ఆవేదన
ప్రతిపక్షం సభలో మాట్లాడేందుకు ఎంత ప్రాధేయపడినా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు
అధికారపక్షంతో మాట్లాడిస్తూ మాపై అసత్య ఆరోపణలకు అవకాశమిచ్చారు
నిరసనగా వాకౌట్ చేస్తామని చెప్పడానికీ స్పీకర్ మాకు మైక్ ఇవ్వలేదు
స్పీకర్ కోడెల, అధికారపక్ష సభ్యులు సభలో 19 సార్లు అభ్యంతరకర భాష వాడారు
అవి పట్టించుకోకుండా.. నేను అన్న ఒక్క మాటను మాత్రం పట్టుకున్నారు
ఎన్నికల ఫలితాల తర్వాత హత్యలపై హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలి
అసెంబ్లీ గాంధీ బొమ్మ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ధర్నాలో జగన్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దిగజారిన శాంతి భద్రతలపై శనివారం శాసనసభలో జరిగిన చర్చ హే యమైన రీతిలో సాగిందని.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షం గొంతును నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తామని చెప్పడానికీ స్పీకర్ తమకు మైక్ ఇవ్వకపోవ డం దారుణమన్నారు. ప్రతిపక్షం ప్రాధేయపడినా మా ట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని, అధికారపక్షం సభ్యులతో అదేపనిగా మాట్లాడిస్తూ తమపై స త్యదూరమైన ఆరోపణలకు అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చర్చలో స్పీకర్ తమకు అవకా శం ఇవ్వకుండా గొంతులు నొక్కేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలం తా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తరువాత శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదురుగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ వైఖరి ని, అధికారపక్షం తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
చర్చను వెటకారం చేస్తున్నారు...
శాంతిభద్రతల పరిస్థితిపై రెండు రోజులుగా అసెంబ్లీ లో జరుగుతున్న చర్చను స్పీకర్, అధికారపక్ష సభ్యు లు వెటకారం చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశా రు. తాము అసెంబ్లీలో చర్చకు తీర్మానం ఇచ్చే నాటికి 11 హత్యలు జరిగాయని, చర్చ కోసం పట్టుపడుతున్న సమయంలో మరో మూడు హత్యలు జరిగాయన్నా రు. గుంటూరు జిల్లా వినుకొండలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒక హత్య జరిగిందన్నారు. ఇవన్నీ ఎన్నికల తరువాత జరిగినవేనని పేర్కొన్నారు. హత్యకు గురైన వారి ఫొటోలతో కూడిన పోస్టర్‌ను జగన్ ప్రదర్శిస్తూ.. ‘‘ఇవన్నీ హత్యలు కావా? వంద రోజుల్లోపే జరిగినవి కావా? ఇవన్నీ సాక్ష్యాలతో సహా పత్రికల్లో వచ్చాయి కూడా. హత్యకు గురైన వారి కుటుంబాలకు ఏం భరోసా ఇస్తారు? ఏ రకమైన అండదండలు అందజేస్తారు? నిష్పాక్షికంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలివ్వండి.. అని మేం ప్రశ్నిస్తూ ఉంటే చర్చను దారుణమైన రీతిలో కొనసాగిస్తున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘ఈ మూడు నెలల నుంచి జరిగిన 14 హత్యల గురించి చర్చిద్దామని, గతంలోకి పోవద్దని మేం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఎపుడో పదేళ్ల కిందటి పాలన గురించే మాట్లాడుతాం అని అధికారపక్షం అంటోంది. గతంలోకి పోతే అవాస్తవాలు మాట్లాడ్డం, ఆరోపణలు చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. అసలు సమస్య పక్కదోవ పడుతుం దని చెప్పినా వినడం లేదు. ఓ పథకం ప్రకారం మా (ప్రతిపక్షం) గొంతు వినపడకుండా వాళ్ల (అధికారపక్షం) గొంతులు మాత్రమే వినపడేలా చేస్తున్నారు’’ అని జగన్ అధికారపక్షం తీరును తప్పుపట్టారు.
స్పీకర్ అన్నదీ అన్‌పార్లమెంటరీయే...
అసెంబ్లీలో స్పీకర్ కోడెలతో సహా అధికారపక్ష సభ్యులంతా 19 సార్లు అన్‌పార్లమెంటరీ (అభ్యంతరకర) భాషను వాడారని జగన్ తెలిపారు. శుక్రవారం చర్చ సందర్భంగా అధికారపక్ష సభ్యులు 18 సార్లు అన్‌పార్లమెంటరీ మాటలను వాడితే స్పీకర్ వారినేమీ అనలేద ని.. తాము ఒక్కసారి అన్‌పార్లమెంటరీ పదాన్ని వాడి తే స్పీకర్ ఆ మాటను పట్టుకుని తనను బాధ్యతారహితంగా మాట్లాడారని చెప్పారన్నారు. స్పీకర్ వాడిన ‘ఇర్రెస్పాన్సిబుల్’ అనే పదం కూడా అన్‌పార్లమెంటరీ అనే సంగతిని ఆయనకు గుర్తు చేస్తున్నానని పేర్కొన్నా రు. ‘‘వాళ్లు అభ్యంతరకర పదజాలం వాడితే ఓకే.. నేను మాత్రం వాళ్లని బఫూన్ల లాగా ప్రవర్తిస్తున్నారు అంటే తప్పట..!’’ అని జగన్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. శనివారం నాడు కూడా బడ్జెట్‌పై చర్చ జరక్కుండా కావాలనే ఈ అంశాన్ని ముందుకు తెచ్చారన్నారు.
అవాస్తవాలను చర్చకు పెడుతున్నారు...
‘‘చర్చలో మాకు మైకులు ఇవ్వలేదు. వాళ్ల (అధికారపక్షం) చేతనే మాట్లాడిస్తున్నారు. వారు మాట్లాడిన మాటల్లో వాస్తవాలున్నాయా అంటే అదీ లేదు. హత్యకు గురైన ఆ కుటుంబాలపై వాళ్లు చేస్తున్న నిందారోపణలు చూస్తూంటే బాధ కలుగుతోంది. చర్చంతా పదేళ్ల కింద జరిగినదానిపైనే జరుగుతోంది. పరిటాల రవి వ్యవహారం గురించి చంద్రబాబును, స్పీకర్‌ను నేను గట్టిగా అడగదల్చుకున్నాను. రవి విషయంలో సీబీఐ ఎంక్వయిరీ జరిగింది. కోర్టుల్లో కేసుల విచారణ జరిగింది. తీర్పులు కూడా వచ్చాయి. దోషులకు శిక్ష కూడా పడింది. ఆ తరువాత కూడా అసెంబ్లీలో చర్చిస్తున్నారు. చంద్రబాబుకు కూడా తెలుసు తాను చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని. కాబట్టే జె.సి.దివాకర్‌రెడ్డి, జె.సి.ప్రభాకర్‌రెడ్డి ఇద్దరినీ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చారు. నిజంగా వారి ప్రమేయం వాస్తవమే అయితే వీరికి చంద్రబాబు టికెట్లు ఇచ్చేవారా? అని గట్టిగా ప్రశ్నిస్తున్నా. అవాస్తవాలను సభలో చర్చకు పెడుతున్నారు. పద్నాలుగు మంది చనిపోతే వాళ్ల కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడరు’’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.
రంగా విషయంలో మేమూ నిలదీయవచ్చు...
‘‘మాకు కూడా మైకులు ఇచ్చి ఉంటే చంద్రబాబును మేం గట్టిగా నిలదీయాలనుకుంటే, సభలో అసలు అంశాన్ని పక్కదోవ పట్టించాలనుకుంటే.. ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి రంగా గారిని టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు దగ్గరుండి చంపించారనే ఆరోపణలున్నాయి. ఇంకా ఆయనను గట్టిగా నిలదీయాలనుకుంటే రంగా హత్య కేసులో పదకొండవ ముద్దాయిగా ఉండిన వెలగపూడి రామకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా చంద్రబాబు పక్కన కూర్చుని ఉన్నారు. ఇంకా అడగాలంటే ఇదే స్పీకర్ కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా ఉన్నపుడే కదా రంగా హత్యకు గురైంది? రంగా హత్యకు బాధ్యత వహించి ఆయన మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు కదా? చర్చను పక్కదోవ పట్టించాలనుకుంటే మేం ఇవన్నీ లేవనెత్తి ఉండొచ్చు’’ అని జగన్ పేర్కొన్నారు.