అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

Perni Nani Assures Journalists Over Housing Lands - Sakshi

‘మీట్‌ ద ప్రెస్‌’లో సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి బ్యూరో: తమ ప్రభుత్వంలో అర్హులైన  జర్నలిస్టులందరికీ ఉగాది నాటికల్లా ఇళ్ల స్థలాలు ఇస్తామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) హామీ ఇచ్చారు.  విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇంటి స్థలం కన్నా రెట్టింపు మొత్తంలో పాత్రికేయులకు స్థలం కేటాయిస్తామన్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా భ్రమల్లో కాకుండా కలను నిజం చేసి చూపుతామన్నారు. వర్కింగ్‌ జర్నలిస్టుల ప్రమాదబీమాను మంగళవారం సాయంత్రానికి రెన్యూవల్‌ చేస్తామని, అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని చెప్పారు. పాత్రికేయులపై జరిగిన దాడుల కేసుల పురోగతిపై రాష్ట్ర హోంమంత్రితో చర్చిస్తానని మంత్రి నాని హామీ ఇచ్చారు. మంత్రి పేర్ని నానికి జర్నలిస్టు సంఘం నాయకులు సన్మానం చేసి, జ్ఞాపికను బహూకరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top