హ్యాపీ బర్త్‌డే వానరా!   | Monkey Birthday Celebrations Kurnool | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే వానరా!  

Jun 21 2019 6:50 AM | Updated on Jun 21 2019 6:52 AM

Monkey Celebrating Her Birthday Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : మృతి చెందిన తల్లి వానరం వద్ద బిక్కమొహం వేసుకుని దిగా లుగా కూర్చున్న పిల్ల వానరాన్ని మూడేళ్ల క్రితం అక్కున చేర్చుకున్న ఓ వ్యక్తి దానికి పాలుపోసి పెంచి పెద్ద చేయడమే కాకుండా ఏటా పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహిస్తూ తన ప్రేమకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం వానర సుతునికి మూడో బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించాడు. సంజామలకు చెందిన మంగలి రాముడు వృత్తి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జాలి గుణం కల్గిన ఈయన ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటాడు.

మూడేళ్ల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీప ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఓ కోతి.. పిల్లను ప్రసవించి కాసేపటికే మృతి చెందింది. ఆ సమయంలో తల్లి శవం వద్దే దిగాలుగా కూర్చున్న పిల్ల వానరాన్ని చూసి మంగలి రాముడు జాలిపడ్డాడు. ఇంటికి తీసుకెళ్లి సొంత బిడ్డలా డబ్బా పాలుపట్టి పెంచాడు. గురువారం కోటవీధిలోని ఆంజనేయస్వామి, రామాలయంలో వానరసుతునికి బర్త్‌ డే వేడుకలు నిర్వహించాడు. కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టాడు. 

Advertisement
 
Advertisement
Advertisement