
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
కళాకారులను ఆదుకోవాలి..
ఏళ్ల తరబడి వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలంగాణ కళారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించి 50 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు రూ.ఐదు వేలు అందించాలి. కళల మీదే ఆధారపడిన కళాకారుల వివరాలు సర్వే చేసి ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలి.
– వివిధ రంగాల కళాకరులు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణలతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు.
● లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ నిర్ణయించి కబ్జాకు గురికాకుండా చూడాలని సీపీఐఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు కోరారు.
● భీమారం మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై భీమారానికి చెందిన సందనవేని అజయ్, హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామ శివారులో భూ ఆక్రమణపై గ్రామానికి చెందిన కునరాపు చంద్రమొగిలి ఫిర్యాదు చేశారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి