Poonch sector
-
పాక్ సైన్యం కర్కశ కాల్పులు
జమ్మూ/శ్రీనగర్/పూంచ్: ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత బరితెగించిన పాకిస్తాన్ సైన్యం సరిహద్దువెంట కన్నుమిన్నుకానక కర్కశంగా కాల్పులకు తెగబడింది. గతంలో ఎన్నడూలేనంతగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ తూటాల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోని పూంచ్æ జిల్లాలో సరిహద్దు వెంట డజన్ల కొద్దీ గ్రామాలపై పాకిస్తాన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సాధారణ నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలపాలైన కొందరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో బల్విందర్ కౌర్ అలియాస్ రూబీ(33), మొహ్మద్ జైన్ ఖాన్(10), జోయా ఖాన్(12), మొహ్మద్ అక్రమ్(40), అమ్రిక్ సింగ్(55), మొహ్మద్ ఇక్బాల్(45), రంజీత్ సింగ్(48), షకీలా బీ(40), అమీర్‌జీత్ సింగ్(47), మరియం ఖటూన్(7), విహాన్ భార్గవ్(13), మొహ్మద్ రఫీ(40), ఒక లాన్స్ నాయక్‌లను గుర్తించారు. పూంచ్ జిల్లాతోపాటు బాలకోటె, మెన్ధార్, మాన్‌కోటె, కృష్ణ ఘతి, గుల్పార్, కెర్నీ సెక్టార్లలో పాక్ రేంజర్ల భారీ స్థాయిలో మోర్టార్లతో కాల్పులు జరిపారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా బుల్లెట్ల వర్షం కురిసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో ఐదుగురు మైనర్లుసహా పది మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెకాŠట్‌ర్‌లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నందాకా ఈ కాల్పులు ఆగలేదు. ఈ కాల్పుల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, బస్టాండ్లు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై తుపాకులు ఎక్కుపెట్టడాన్ని మాజీ జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తీవ్రంగా తప్పుబట్టారు. బోర్డర్‌కు ఆవల డజన్ల మంది మృతి పాక్ రేంజర్ల కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో సరిహద్దుకు ఆవల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం ప్రకటించింది. దాయాది ఆర్మీ పోస్ట్‌లను ధ్వంసం చేసింది. ముందు జాగ్రత్తగా సరిహద్దు జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్‌లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను బుధవారం మూసేశామని డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 13వ రోజు. పూంఛ్–రాజౌరీలోని భీంబర్ గలీలో పాక్ కాల్పులు కొనసాగిస్తోందని భారతఆర్మీలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాల్పుల బారిన పడకుండా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
జమ్మూ: పాకిస్తాన్ సైన్యం మరోసారి హద్దు మీరింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో పాక్ సైన్యం తోకముడిచింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ఈ ఘటన జరిగినట్లు భారత సైనిక అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఎల్ఓసీ వద్ద కృష్ణా ఘాటీ సెక్టార్లో తొలుత మందుపాతర పేలుడు సంభవించిందని, ఆ తర్వాత పాక్ భూభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు మొదలయ్యాయని అన్నారు. అక్కడే విధుల్లో ఉన్న భారత సైన్యం వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపిందని తెలిపారు. భారత సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో చేసేది లేక పాక్ సైన్యం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్ఓసీ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టంచేశారు. ఎల్ఓసీ వెంట భారత సైన్యం పట్టు కొనసాగుతోందని తెలియజేశారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో పాక్ సైన్యానికి ఏమైనా ప్రాణనష్టం వాటిల్లిందా? అనేది బయటపెట్టలేదు. ఐదుగురు పాక్ జవాన్లు గాయపడినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. -
ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలు పూంఛ్, రాజౌరీల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణ కోసమని తీసుకెళ్లి ముగ్గురు పౌరులను ఆర్మీ అధికారులు చంపేశారంటూ పార్టీల నేతలు, స్థానికులు నిరసనకు దిగారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది. వదంతులు వ్యాపించకుండా పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ నెల 21న పూంఛ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు అసువులు బాయడం తెలిసిందే. అనంతరం ఆర్మీ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు శుక్రవారం రాత్రి శవాలై కనిపించారు. వారిని చిత్రహింసలు పెట్టిన వీడియోలు బహిర్గతమయ్యాయి. ఇది ఆర్మీ అధికారుల పనేనని స్థానికులు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తతలు -
పూంఛ్ ఘటన ప్రమాదం కాదు.. ఉగ్రదాడి: భారత ఆర్మీ
ఢిల్లీ: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో గురువారం జవాన్ల ట్రక్కుకు జరిగింది ఘోరం ప్రమాదం కాదని.. అది ఉగ్రదాడి అని భారత సైన్యం నిర్ధారించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించింది ఆర్మీ. జమ్ము-పూంచ్ హైవేపై రాజౌరీ సెక్టార్ తోతావాలి గల్లీ దగ్గర జవాన్లు వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారని, మంటలు చెలరేగి రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం చెందినట్లు ఆర్మీ తెలిపింది. మరో జవాన్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జవాన్లను ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి మోహరించే క్రమంలోనే ఈ ఘోరం జరిగింది. వర్షం పడుతుండడంతో ట్రక్కు నెమ్మదిగా వెళ్లోందని, ఇది ఆసరాగా తీసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరి దాడికి పాల్పడ్డారని సైన్యం తెలిపింది. తొలుత ఇది పిడుగు ప్రమాదంగా భావించిన ఆర్మీ.. దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా.. చివరికి ఉగ్రదాడిగానే తేల్చింది. -
2 వేల సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘన..
న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఆరు నెలల్లో నియంత్రణ రేఖ వెంబడి మొత్తంగా దాదాపు 2 వేల సార్లు దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ మొదటి పది రోజుల్లో 114 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించారు. ‘‘2020లో మొదటి ఆరు నెలల్లో 2 వేల సార్లకు పైగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. గతేడాది ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడింది. ఆనాటి నుంచి రోజు రోజుకీ ఈ గణాంకాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో 2020 తొలి అర్ధభాగంలోనే రికార్డు స్థాయిలో కాల్పుల ఉల్లంఘన జరిగింది ’’అని పేర్కొన్నారు.(పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ!) కాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. ఇక 2018లో ఈ సంఖ్య 1629గా నమోదైంది. ఇదిలా ఉండగా.. గత ఐదు రోజులుగా పూంచ్ సెక్టార్లో పాక్ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూంచ్‌లోని షాపూర్, కిర్ణి, కస్బా సెక్టార్లలో పాక్ ఆర్మీ పోస్టులను ముందుకు జరిపిందని తెలిపాయి. -
భీకర పోరు: 13 మంది ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు, భారత సైన్యానికి భీకర పోరు జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన 13 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఎదురుకాల్పుల్లో పలువురు భారత జవాన్లు సైతం గాయపడ్డారు. వారికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న అధికారులు సంబంధిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై సైన్యం తూటాల వర్షం కురిపింది. కాగా దీనిపై సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. మార్చి 28 నుంచే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు కుట్రలు పన్నుతున్నారని సమాచారం అందినట్లు తెలిపారు. వాటి ఆధారంగానే పూంచ్ సెక్టార్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదుల తారసపడ్డరని వెల్లడించారు. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసి.. కాల్పులు జరిపామని చెప్పారు. -
కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు∙
జమ్మూ: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న గ్రామాల్లో పాక్ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా పరిధిలోకి వచ్చే దాదాపు అరడజను ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాక్ తీవ్ర కాల్పులకు పాల్పడిందని రక్షణ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఘటనలో 16 జంతువులు మృతిచెందినట్లు పూంచ్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. -
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
-
సహచరుడి హత్యకు ప్రతీకారం కోసం...
జమ్ము: శ్రీనగర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని మెహందర్ పరిధిలోని సలానీ గ్రామం. సుమారు 50 మంది యువకులు సౌదీలో తమ ఉద్యోగాలను వదిలేసుకుని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. అందుకు కారణం తమ గ్రామంలోని ఓ యువకుడి హత్యతో వారంతా రగిలిపోతుండటమే. రెండు నెలల క్రితం జమ్ము కశ్మీర్లో దారుణ హత్యకు గురైన రైఫిల్ మన్ జౌరంగజేబు ఉదంతం వారందరినీ కదిలించింది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ యువకులంతా పోలీస్, ఆర్మీ ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. (ఇంకెంతకాలం ఇలా...?) ‘జౌరంగజేబు మరణ వార్త వినగానే నేను ఇండియాకు బయలుదేరా. నాతోపాటు మరో 50 మంది యువకులు స్వచ్ఛందంగా తమ సహచరుడి కోసం ఇక్కడికి వచ్చారు. వారంతా అక్కడ మంచి ఆదాయం సంపాదించేవారే. కానీ, తమ గ్రామస్థుడి క్రూర హత్యపై వాళ్లు రగిలిపోతున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఇక్కడికి వచ్చారు. ఎలాగైనా ఉగ్రవాదులపై పగ తీర్చుకుంటామని వారంతా శపథం పూనారు. ఆర్మీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు’ అని ఔరంగజేబు బంధువు మహ్మద్ కిరామత్ చెబుతున్నారు. ఔరంగజేబు మరణం తర్వాత మరో ఇద్దరు అధికారులను.. అదే రీతిలో ఉగ్రవాదులు అపహరించి పొట్టనబెట్టుకున్నారు. అంతేకాదు అధికారులను రాజీనామాలు చేయాలంటూ బెదరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గత నెలలో దక్షిణ కశ్మీర్లో ఓ అధికారిని కిడ్నాప్ చేసి బలవంతంగా అతనితో రాజీనామా చేయించారు. అయితే బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని ఓ అధికారి తెలిపారు. ‘దేశం కోసం మా సోదరులు అమరులౌతున్నారు. అలాంటిది మేం ఎందుకు వెనక్కి తగ్గుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇలాంటి ఉదంతాలకు తొణికేది లేదని, తమ పిల్లలను సైన్యంలోకి పంపి తీరతామని ప్రతిన బూనుతున్నారు. (ఎంత దారుణంగా చంపారంటే...) -
జమ్మూ కశ్మీర్లో పాక్ దుశ్చర్య
జమ్మూ: పొరుగు దేశం పాకిస్తాన్ మళ్లీ దుశ్చర్యకు తెగబడింది. భారత్‌ను రెచ్చగొట్టేలా ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ లోని బాలాకోటే సెక్టార్ సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఆదివారం మోర్టారు బాంబులతో విరుచుకు పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు మైనర్ సోదరులు. మరో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కూడా గాయపడగా వారిని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికలను మాత్రం హెలికాప్టర్ ద్వారా జమ్మూలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు భారత భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఫ్తీ తన సంతాప సందేశాన్ని ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 7.45 నుంచి 11.30 గంటల వరకు పాకిస్తాన్ విచక్షణారహితంగా దాడులకు తెగబడినట్లు ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. పాక్ కవ్వింపు చర్యల ఫలితంగా ఐదుగురు సాధారణ పౌరులు చనిపోయారనీ, ఆ దేశం ఎప్పుడూ అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. పౌరుల ప్రాణాలకు ఎటువంటి ముప్పూ లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జమ్మూ ఐజీ ఎస్డీఎస్ జమ్వాల్ చెప్పారు. -
షాకింగ్.. సరిహద్దులో పాక్ ఆర్మీ హెలికాప్టర్లు..
సాక్షి, జమ్ముకశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి హద్దు మీరింది. సరిహద్దులో పిల్ల చేష్టలు ఆడబోయింది. ఓ పక్క చొరబాట్లకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు దిగుతున్న పాక్ ఏకంగా హెలికాప్టర్లతో దేశంలోకి చొరబడే దుస్సాహాసానికి ఒడిగట్టింది. ఏకంగా మూడు హెలికాప్టర్లతో పాక్ ఆర్మీ భారత భూభాగంలోకి అడుగుపెట్టింది. పూంచ్ సెక్టార్‌లోని 300 మీటర్లలోపలికి హెలికాప్టర్లు వచ్చాయి. భారత ఆర్మీ ఈ దృశ్యం చూసి అప్రమత్తం అయింది. దీంతో వెంటనే పాక్ ఆర్మీ హెలికాప్టర్లు తోకముడిచాయి. వెనుదిరిగి వెళ్లిపోయాయి. ఏ మాత్రం అవి ఆలస్యం చేసినా భారత బలగాల చేతులో నేలకూలి పెను సంచలనంగా మారేది. ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పాక్ హైకమిషనర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, పాక్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే యోచన చేస్తున్నారు. -
నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం కాల్పులు
-
నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం కాల్పులు
జమ్ము: పదే పదే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి శుక్రవారం తెల్లవారుజాము నుంచి పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు వారికి ధీటుగా జవాబిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేజీ సెక్టార్లో కాల్పులు కొనసాగుతుండటంతో.. స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. మోటర్ల ద్వారా కాల్పులు జరుగుతుండటంతో.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. -
పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే
-
50 మంది పాక్ సైనికుల తలలు కావాలి
► అమర జవాన్ ప్రేమ్ సాగర్ కుమార్తె డిమాండ్ ► ప్రభుత్వానికి చేతకాకపోతే తాను ప్రతీకారం తీర్చుకుంటానన్న పరంజీత్ భార్య న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో శిరచ్ఛేదం చేసిన ఇద్దరు భారత జవాన్ల కుటుంబాలు తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘మా నాన్న అమరుడయ్యాడు. ఆయన త్యాగం వృథా కాకూడదు. ఒక తలకు బదులుగా నాకు 50 మంది పాక్ సైనికుల తలలు కావాలి’ అని బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్(45) కుమార్తె సరోజ్ డిమాండ్ చేశారు. ఓ పక్క ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, మరోపక్క తల్లి శాంతిని ఓదారుస్తూ ఈ కోరిక కోరింది. దారుణ హత్యకు గురైన మరో జవాన్ నాయిబ్ సుబేదార్ పరంజీత్ సింగ్(42) కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా పాక్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పేందుకు ప్రభుత్వం ఆర్మీకి స్వేచ్ఛనివ్వాలి. పాక్ ఒక భారత సైనికుడి తల నరికితే పదిమంది శత్రు సైనికులకు అదే గతిపడుతుందని మన ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ ఇప్పడేం జరుగుతోంది? పాక్‌కు ప్రభుత్వం గుణపాఠం నేర్పకపోతే నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు అనుమతివ్వాలి’ అని పరంజీత్(42) భార్య పరంజీత్ కౌర్ అన్నారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం నేర్పాలని పరంజీత్ సింగ్ తండ్రి ఉధమ్ సింగ్, సోదరుడు రంజిత్ సింగ్‌లు కూడా డిమాండ్ చేశారు. పరంజీత్ బలిదానానికి గర్విస్తున్నామన్నారు. పరంజీత్‌కు 11–14 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. నా తండ్రి త్యాగానికి గర్విస్తున్నా: పరంజీత్ కుమార్తె దేశం కోసం తన తండ్రి ప్రాణత్యాగం చేసినందుకు తనకు గర్వంగా ఉందని పరంజీత్ కుమార్తె సిమర్దీప్ కన్నీటిపర్యంత మవుతూ చెప్పింది. పరంజీత్ సింగ్ అంత్యక్రియలను పంజాబ్ తార్న్ తారన్ జిల్లాలోని ఆయన స్వగ్రామం వయిన్పూర్లో మంగళవారం అశ్రునయనాల మధ్య సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సైనికులు తుపాకులు పేల్చి వందనం సమర్పిం చారు. స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలి వచ్చి ఘనంగా నివాళి అర్పించారు. ‘షహీద్ పరంజీత్ అమర్ రహే..పాకిస్తాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియలకు, తమ కుటుంబాన్ని పరామర్శించడానికి సీనియర్ అధికారులెవరూ రాలేదని పరంజీత్ కౌర్ ఆరోపిం చారు. ఆర్మీలో పనిచేసిన సీఎం అమరీందర్.. తన సోదరుడి అంత్యక్రియలకు హాజరై ఉండాల్సిందని రంజిత్ సింగ్ అన్నారు. పాక్ దారుణానికి నిరసనగా పంజాబ్‌లో లూధియానా తదితర చోట్ల ఆ దేశ పతాకాలను తగలబెట్టారు. మరోపక్క.. ప్రేమ్ సాగర్ భౌతికకాయాన్ని ఉత్తరప్రదేశ్‌లో దేవరియా జిల్లాలోని ఆయన స్వగ్రామమైన టేకన్పూర్ తరలించారు. అంతకుముందు ఈ ఇద్దరు అమరవీరుల భౌతికకాయాలకు పూంచ్‌లో సైనికులు ఘనంగా నివాళి అర్పించారు. -
పూంఛ్ సెక్టార్లో మళ్లీ పాకిస్థాన్ దళాల కాల్పులు
సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా హెచ్చరించినా, ఏకంగా రాష్ట్రపతే సహనానికి హద్దు ఉంటుందని చెప్పినా పాపిస్థాన్గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకోవట్లేదు. మరోసారి నియంత్రణ రేఖ వద్ద ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి, రాకెట్లు, మోర్టార్లతో దాడులకు తెగబడింది. దీంతో ముగ్గురు ఆర్మీ జవాన్లు, మరో పౌరుడు గాయపడ్డారు. జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్లోనే ఇదంతా జరిగింది. గడిచిన ఐదు రోజుల్లో పాకిస్థానీ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 11వ సారి. పూంఛ్ జిల్లాలోని బాలాకోట్ ప్రాంతంలో ఉదయం 6.30 నుంచి పలు మార్లు భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చి కాల్పులు జరిపినట్లు సైనికాధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో దాడి చేయడంతో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. పర్వైజ్ అనే స్థానికుడు కూడా గాయపడ్డాడు. బసోనియా గ్రామంలో ఓ గోశాల మీద రాకెట్ పడి పేలడంతో దాదాపు 12 ఆవులు చనిపోయాయి. పాకిస్థానీ దళాలు తెల్లవారుజాము నుంచి ఎలాంటి కారణం లేకుండా కాల్పులు జరుపుతూ భారత్‌లోని మెంధార్ సెక్టార్ వైపు చొచ్చుకొచ్చినట్లు జమ్ము రక్షణ శాఖ ప్రతినిధి ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. వెంటనే భారత దళాలు భారీ ఆయుధాలతో దీటుగా సమాధానమిచ్చాయని, మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపారు. 2003 సంవత్సరంలో భారత్-పాక్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి అర్థం పర్థం లేకుండా పోతోంది. దాదాపు ప్రతిరోజూ ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు 57 సార్లు పాకిస్థానీ దళాలు కాల్పులు జరిపాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 80 శాతం ఎక్కువని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
శ్రీనగర్ : పాకిస్తాన్ బలగాలు మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. అయిదుగురు భారతీయ జవాన్ల ఊచకోతపై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాలు సోమవారం తెల్లవారుజామున మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. జమ్మూ, కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారతీయ సైనిక స్థావరాలపై భారతీయ సైనికులే లక్ష్యంగా పాక్ మళ్లీ కాల్పులు జరిపింది. అయితే కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాక్ సైనికులు పెద్దఎత్తున ప్రాణనష్టం కలిగించడం కోసం పలు భారతీయ సైనిక స్థావరాలపై భారీ ఆయుధాలతోను కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. పాక్ సైన్యాలు నిన్నటి నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. -
ఫూంచ్ సెక్టార్లో మరోసారి కాల్పుల ఉల్లంఘన
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ కాశ్మీర్లో శనివారం పాకిస్తాన్ సైన్యం భారత్ జవాన్లపై కాల్పులకు తెగబడింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ భారత్- పాకిస్తాన్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్‌లోని పాక్ సైన్యాలు కాల్పులకు మళ్లీ తెగబడ్డాయి. అయితే భారత్ బలగాలు ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను పాకిస్థాన్ పలుమార్లు ఉల్లంఘిస్తూ వస్తోంది. పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడటం పరిపాటిగా మారిపోయింది. గత మంగళవారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అయిదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలి -
పాక్ దుర్మార్గంపై మండిపడ్ద యువత
-
పూంఛ్ ప్రాంతాన్ని సందర్శించిన ఆర్మీచీఫ్ బిక్రం సింగ్
పూంచ్ జిల్లాలో భారత సైనికులపై పాకిస్థాన్ మూకలు కాల్పులు జరిపి హతమార్చిన సంఘటనపై వాస్తవాలు పరిశీలించి, పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ బుధవారం అక్కడకు చేరుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని కూడా ఆయన సమీక్షించనున్నారు. జనరల్ సింగ్ ముందుగా పూంఛ్ జిల్లాతో పాటు జమ్ము ప్రాంతంలో నియంత్రణ రేఖను పరిరక్షించే 16 కోర్ దళం ప్రధాన కార్యాలయం ఉన్న నగ్రోటాను సందర్శించారు. అనంతరం రాజౌరి వెళ్లి అక్కడ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పలువురు సీనియర్ ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం పూంఛ్ వద్దకు వెళ్లి అక్కడ నియంత్రణ రేఖ సమీపంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు. పాకిస్థానీ సైనిక దుస్తులలో ఉన్న దాదాపు 20 మంది వచ్చి పూంఛ్ సెక్టార్‌లోని చకన్ దా బాగ్ ప్రాంతంలో భారత సైనికులపై కాల్పులు జరిపి ఐదుగురిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో భారత సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారికి అండగా ఉండేందుకు బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. -
గీత దాటిన పాక్: ఐదుగురు భారత జవాన్ల హతం