ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై, టీడీపీ నాయకులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడికి అసలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని అన్నారు. మరోసారి ఓటేస్తే ఇక అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో రోజా మాట్లాడుతూ ’ఈరోజు వైఎస్‌ఆర్ ను గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఆ రోజు రాజశేఖర్‌రెడ్డిని బ్రతికించడానికి మీరుపడ్డ తాపత్రయాన్ని గుర్తుంచుకోవాల్సిన రోజు. తన తండ్రి కోసం నల్లకాలువ వద్దకు వైఎస్ జగన్ వచ్చిన సందర్భం గుర్తుంచుకోవాలి. ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజలకోసం పనిచేస్తున్న వైఎస్ జగన్‌ను గుర్తుంచుకోవాలి. అన్ని పార్టీలు కలిసి వైఎస్ జగన్‌పై కక్షగట్టి కేసులు పెట్టారు. అయినా వైఎస్ జగన్ ఏం చేయలేదు.