
నా కుమారుడు మఠాధిపతిగా అర్హుడు
బ్రహ్మంగారిమఠం: పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి తన పెద్ద కుమారుడు గోవిందస్వామి మఠాధిపతిగా అర్హుడని పూర్వపు మఠాధిపతి ద్వితీయ భార్య మారుతీ మహాలక్షుమ్మ తెలిపారు. శనివారం బి.మఠంలో మహా నివేదిన మందిరంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారులు నలుగురిలో ఏ ఒక్కరూ మఠం ఆచారాలు పాటించలేదని అందుకు వారికి అర్హత లేదనేది పూర్వపు మఠాధిపతి వాదన అన్నారు. తన పెద్దకుమారుడు గోవిందస్వామి మఠం ఆచారాలపై ఎక్కువ మక్కువగా ఉండడంతో 2018లో పూర్వపు మఠాధిపతి వీలునామా రాశారన్నారు. తన తరువాత మఠాధిపతిగా తన రెండవ భార్య మొదటి సంతానం గోవిందస్వామి నియామకం జరగాలనేది పూర్వపు మఠాధిపతి ఆదేశం అన్నారు. వీలునామా ప్రకారం మఠాధిపతి నియామకం జరగాలని తాను కోరుతున్న సమయంలో పూర్వపు మఠాధిపతి పెద్ద భార్య కుమారులు అడ్డుతగలడంతో కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కోర్టు కూడా మఠాధిపతిని నిర్ణయించే బాధ్యత ధార్మిక పరిషత్‌కు అప్పజెప్పిందన్నారు. ధార్మిక పరిషత్ ద్వారా తమకు న్యాయం జరగక పోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆమె వివరించారు.
విలేకరుల సమావేశంలో మారుతీ మహాలక్షుమ్మ