
అత్యుత్తమ నాణ్యతకు హామీ భారతి సిమెంట్
పులివెందుల రూరల్ : నాణ్యతా ప్రమాణాలలో మేటి భారతి సిమెంట్ అని భారతి సిమెంట్ కంపెనీ డీజీఎం ఓబుళ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని స్థానిక మైరా రెస్టారెంట్‌లో కాంట్రాక్టర్లకు భారతి సిమెంట్ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతుందన్నారు. ఇతర కంపెనీ సిమెంట్‌తో పోలిస్తే తక్కువ సమయంలోనే భారతి సిమెంట్ సెట్ అవుతుందన్నారు. వేగంగా కట్టే బిల్డింగ్‌లకు అత్యుత్తమ పరిణామాలను, నాణ్యతను భారతి ఆల్ట్రా పాస్ట్ సిమెంట్ రెండు గంటల్లోనే సెట్ అవుతుందన్నారు. చాలా దృఢత్వాన్ని కలిగి ఉన్న భారతి సిమెంట్‌తో కట్టడాలు త్వరగా పూర్తవుతాయన్నారు. మార్కెట్‌లో చాలామంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు భారతి సిమెంట్ వాడుతున్నారన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ కంపెనీ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, నాగేంద్రబాబు, డీలర్ అశోక్, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.