
వాకథాన్ ర్యాలీని జయప్రదం చేయండి
కడప సెవెన్‌రోడ్స్: అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా గురువారం కడప నగరంలో నిర్వహించే వాకథాన్ ర్యాలీని జయప్రదం చేయాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ అంశంపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు కడప కోటిరెడ్డిసర్కిల్ నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా ర్థులు, యువత, ప్రజలు, వివిధ శాఖల అధికా రులు పాల్గొనాలని కోరారు.
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు
240 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌కు జిల్లావ్యాప్తంగా 68001వ ర్యాంకు నుంచి 86 వేల ర్యాంకులకు సంబంధించిన 240 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు తమ ధ్రువపత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో కో–ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, ఛీప్ వెరిఫికేషన్ ఆఫీసర్ పద్మజ, వెరిఫికేషన్ ఆఫీసర్లు ప్రసాద్, ప్రశాంతి, ప్రసన్న, రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నేటి కౌన్సెలింగ్‌కు...
జిల్లావ్యాప్తంగా 86001 నుంచి 104000 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు గురువారం కౌన్సెలింగ్ ఉంటుందని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు.
వర్థిని కన్‌స్ట్రక్షన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ కె. సురేష్ బాబు తనయుడు రిజిస్టర్ చేసిన వర్థిని కన్‌స్ట్రక్షన్స్ సంస్థను రద్దు చేస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్‌టీ నంబర్ 625ను జారీ చేశారు. వర్థిని కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ద్వారా కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు చేయడంపై కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి సమర్పించారు. వారి నివేదిక మేరకు పురపాలక శాఖ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మేయర్ సింగిల్ బెంచ్‌ను, ఆ తర్వాత డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మళ్లీ విచారణ జరిపిన అధికారులు వర్థిని కన్‌స్ట్రక్షన్స్ సంస్థను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.
29న బీసీ మహాసభ
మదనపల్లె సిటీ: మదనపల్లెలో ఈనెల 29న జరిగే బీసీ మహాసభను జయప్రదం చేయాలని బీసీ జనసభ వ్యవస్థాపకుడు బోడే రాజశేఖర్ తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందని ప్రశ్నించారు.
బొల్లి మచ్చలు అంటువ్యాధి కాదు
కడప కోటిరెడ్డిసర్కిల్: బొల్లిమచ్చలు ఒకరినుంచి సంక్రమించే అంటువ్యాధి కాదని రిమ్స్ డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ పెంచలయ్య అన్నారు. ప్రపంచ బొల్లి మచ్చల దినోత్సవం సందర్భంగా కడప రిమ్స్‌లోని చర్మవ్యాధుల(డెర్మటాలజీ) విభాగంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ బొల్లి మచ్చలు వంశపారపర్యంగా, ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాదన్నారు. బొల్లి మచ్చలతో ఒక వ్యక్తి శారీరక, మానసిక సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. ప్రారంభ దశలోనే చర్మవ్యాధుల నిపుణుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలున్న వారిపై వివక్ష చూపకుండా సమాజంలో అందరితో సమానంగా ఆదరించాలన్నారు. డెర్మటాలజీ విభాగం వైద్యులు డాక్టర్ సుభాషిణి, డాక్టర్ నరోత్తమరెడ్డి, డాక్టర్ విజయకుమారి పాల్గొన్నారు.

వాకథాన్ ర్యాలీని జయప్రదం చేయండి