
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జిల్లా అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. బుధవారం విజయవాడలోని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నుంచి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ కె. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.