
గుండెపోటుతో మిలటరీ అధికారి మృతి
తొండూరు : మండల కేంద్రమైన తొండూరు గ్రామానికి చెందిన హవల్దార్ బూచుపల్లి శివప్రకాశ్‌రెడ్డి (43) గుండెపోటుతో మృతి చెందారు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం తొండూరు నుంచి పులివెందులకు కారులో ప్రయాణిస్తుండగా పులివెందుల సమీపంలోని టి.తుమ్మలపల్లి గ్రామం వద్దకు రాగానే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలిపారు. ప్రకాష్‌రెడ్డి పంజాబ్‌లోని కుర్రోల్పూర్ లో 7 ఆర్టీ బ్రిడ్జి అధికారిగా పనిచేసేవాడన్నారు. సెలవు మీద ఇంటికి వచ్చి వ్యక్తిగత పని మీద పులివెందుల వెళ్తుండగా మార్గ మధ్యంలో గుండెపోటుతో మృతి చెందారు. మృతుడికి భార్య నాగేశ్వరితోపాటు ముగ్గురు పిల్లలు అక్షిత, జ్యోత్స్న, రిత్విక్ రెడ్డి ఉన్నారు.