
అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా అచీవర్స్ డే
చింతకొమ్మదిన్నె : కడప నగరం రాయచోటి రోడ్డులోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ మల్టీ నేషనల్ కంపెనీలైన టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎంఎఫ్‌సిస్, ఎంకోరేటా, మెగా స్మార్ట్ సొల్యూషన్స్‌లలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో అచీవర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 2024–2025 విద్యా సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో అత్యధిక ఉద్యోగాలు పొందడంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. తమ కళాశాల చైర్మన్ సి.గంగిరెడ్డి క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల హెచ్–ఎస్ విభాగాధిపతి కేఎన్ శశికుమార్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఓ.హోమకేశవ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.