
వలిగొండ మండలం గోకారం గ్రామంలో డంప్ చేసిన ఇసుక
నిఘా కరువు..
రెవెన్యూ ఽఅధికారులు ఇచ్చిన అనుమతులకు మించి అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి తీసుకున్న చోటుకు కాకుండా మరో చోటుకు తరలిస్తున్నా పోలీస్ నిఘా వైఫల్యంతో ఇసుక రవాణా సాగుతోంది. పలుమార్లు ఇసుక ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదై.. జరిమానాలు చెల్లించిన తర్వాత అధికారుల అండతో మరింత ఎక్కువగా అక్రమ దందా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని మూసీ నది, ఆలేరు, బిక్కేరు, వాగుల్లోని ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. నదులు, వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగిస్తున్నారు. స్థానిక అవసరాల అనుమతుల పేరుతో తరలిస్తున్న ఇసుకను ఒక దగ్గర డంపు చేసి రాత్రి సమయాల్లో లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇసుక తరలింపులో భాగంగా పంచాయతీ, రెవెన్యూ అధికారులు, పోలీసులకు ముడుపులు ముడుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌కు తరలింపు
వలిగొండ, రామన్నపేట, మోత్కూరు మండలాల్లో మూసీ నదిలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. మూసీ పరిసర గ్రామాలైన వేములకొండ, గోకారం, వలిగొండ, పొద్దటూరు, నాగారం, లింగరాజుపల్లి, లోతుకుంట, శోభనాద్రిపురం, లక్ష్మాపురం, పల్లివాడ, సూరారం, పొడిచేడు, దత్తప్పగూడెం కేంద్రాలుగా ఈ దందా నడుస్తోంది. స్థానిక ప్రజల అవసరాలు, ప్రభుత్వ నిర్మాణాలకోసం రెవెన్యూ శాఖ నుంచి అనుమతి పొందిన ట్రాక్టర్ యజమానులు అనుమతి కంటే ఎక్కువ ట్రిప్పులను తరలిస్తున్నారు. పగటి సమయంలో తరలించాల్సిన ఇసుకను రాత్రి పూట తరలిస్తున్నారు. అదేవిధంగా రాయిపల్లి, కొరటికల్, కప్రాయిపల్లి, పోతిరెడ్డిపల్లి, సింగారం, రహీంఖాన్‌పేట, గుండాల మండలం బండకొత్త పల్లి, వస్తాకొండూరు, మాసాన్‌పల్లి, అనంతారం తదితర గ్రామాల శివారులోని వాగుల నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. కొలనుపాక, గొలనుకొండ, కొల్లూరు తదితర గ్రామాల నుంచి జనగామ, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆలేరు వాగు నుంచి తరలించిన ఇసుకను బైపాస్ రోడ్డులో డంప్ చేసి, రాత్రి సమయంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మూసీ ఇసుకను గోకారం, వేములకొండలో డంప్ చేసి లారీల్లో తరలిస్తున్నారు.
ఫ మూసీనదిలో రాత్రి వేళ తవ్వకాలు
ఫ స్థానిక అవసరాల పేరుతో డంప్‌లు
ఫ ఆలేరు, బిక్కేరు వాగుల నుంచి
హైదరాబాద్‌కు ఇసుక తరలింపు
ఫ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు

మూసీ నది నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుబడ్డ లారీ (ఫైల్)