
మురికి కాల్వలు అస్తవ్యస్తం
రూ.లక్షలు ఖర్చు చేసి డ్రెయినేజీలు నిర్మిస్తున్న అవి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిమెంట్, ఇసుక మోతాదులో వాడకపోవడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కాలుతో తన్నితే మురికి కాల్వలు కూలిపోతున్నాయి. కనీసం వానాకాలం సీజన్ వరద రాకముందే దెబ్బతింటున్నాయి.
– నద్దునూరి నాగరాజు, చింతగట్టు
నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
సైడ్ డ్రెయినేజీల నిర్మాణం త్వరగా, తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం కోసం రెడ్‌మిక్స్‌తో పూర్తి చేస్తున్నారు. పూర్తయిన మురికి కాల్వలకు సరిగా క్యూరింగ్ చేపట్టడం లేదు. పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదేంటని అడిగితే వర్క్ అగ్రిమెంట్‌లో ఇలానే ఉందంటున్నారు.
– పెరుగు సురేష్, న్యూశాయంపేట
రోడ్లపైకి నీళ్లు వస్తున్నయ్..
వరంగల్ మార్కెట్ ఏరియాలో సీసీ రోడ్లు వేసి సైడ్ డ్రెయినేజీ నిర్మించారు. అయితే కొద్ది రోజులకే డ్రెయినేజీ దెబ్బతినడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుంది. పారిశుద్ధ్యం సరిగా లేక రోడ్లపైకి వస్తున్న బురద దుర్వాసన, దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం.
– మాడిశెట్టి భరత్, పాతవీధి
మురుగును భరించలేకున్నాం..
ఆర్భాటంగా నిర్మించిన డ్రెయినేజీలు.. ఆ తర్వాత నిర్వహణకు నోచుకోవడం లేదు. 39వ డివిజన్‌లోని కరీమాబాద్ ప్రాంతంలో మురికికాల్వల్లో చెత్త, మురుగు నిలిచి విపరీతంగా దుర్గంధం వస్తుంది. ఇటీవల వర్షాలకు మురుగు నీరుతోపాటు దోమల వల్ల సీజనల్ వ్యాధులు వస్తున్నాయి.
– కొప్పుల రాజ్‌కుమార్, కరీమాబాద్

మురికి కాల్వలు అస్తవ్యస్తం

మురికి కాల్వలు అస్తవ్యస్తం

మురికి కాల్వలు అస్తవ్యస్తం