
అధ్యక్ష పదవికి పోటాపోటీ
బషీరాబాద్: కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్ష పదవికి నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది. మండల కేంద్రం నుంచి తొమ్మిది మంది పాత నేతలు, కొత్తగా వచ్చిన మరో వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత మండల అధ్యక్షుడు కలాల్ నర్సింలు, సీనియర్ నాయకులు రామునాయక్, వడ్డే ఉల్గప్ప, శంకర్‌నాయక్, రాజవర్ధన్‌రెడ్డి, మాణిక్‌రావు, నరేష్ చౌహన్, సిద్ధార్థ్, వాల్మికి నరేష్, కంసాన్‌పల్లి వెంకట్‌రెడ్డి రేసులో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవీ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేష్ మహరాజ్ దరఖాస్తు చేశారు. వీరితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ వంటి అనుబంధ సంఘాల మండల అధ్యక్ష పదవుల కోసం మరో 30 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే 2017 కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న వారికే అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా యువతకే అవకాశం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకుడు మాణిక్‌రావు డిమాండ్ చేస్తున్నారు. తాను కూడా పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహరాజ్ సూచన మేరకు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బరిలో పది మంది ఆశావహులు
ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు