
హనుమాన్ విగ్రహ ధ్వంసం
అనంతగిరి: హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్‌లోని సుభాష్‌నగర్ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్డుపై నిరసన వ్యక్తంచేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి, దుండగులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుల్లపల్లి రమేష్‌కుమార్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానందరెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్, శ్రీదేవి, పోకల సతీష్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు చరణ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో
హిందూ సంఘాల ఆందోళన
దుండగులను పట్టుకోవాలని
బీజేపీ నేతల డిమాండ్