
నగదు రహిత ఆరోగ్య కార్డులివ్వాలి
ధారూరు: నగదు రహిత ఆరోగ్య కార్డులను ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా అధ్యక్షుడు కె.అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని పలు పాఠశాలలను ఆయన సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో పీఆర్‌సీ, డీఏను వర్తింప జేయాలని కోరారు. సంఘంలో పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమాల్‌రెడ్డి, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.రాజు, బాల్‌రాజ్‌లు, కోశాధికారి విజయ్, జిల్లా బాధ్యులు రాజ్‌కుమార్, సంతోష్, సభ్యులు సుధాకర్‌రెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తపస్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి