
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
తాండూరు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ర్యాడిప్ యాక్షన్ ఫోర్స్ టీం కవాతు నిర్వహించింది. పట్టణంలోని ఆలయాలు, మజీదులు, పురవీధుల మీదుగా కవాతు కొనసాగింది. డీఎస్పీ వెంట సీఐ సంతోశ్‌కుమార్ తదితరులున్నారు.
ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి సేవలు అభినందనీయం
తాండూరు పట్టణ ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. పట్టణ ఎస్సైగా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ పొందిన మహిపాల్ రెడ్డిని డీఎస్పీ తన కార్యాలయంలో సన్మానించారు. 1984లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన మహిపాల్ రెడ్డి ఏఎస్‌ఐగా, ఎస్‌ఐగా పదోన్నతి సాధించారు. జిల్లాలోని బషీరాబాద్, బంట్వారం, తాండూరు పట్టణంతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ ఆయన ఎస్‌ఐగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్‌గా ఉద్యోగాన్ని సాధించి, ఎస్‌ఐగా రిటైర్డ్ అయిన మహిపాల్ రెడ్డి విధుల పట్ల అంకితభావంతో ఉండేవారన్నారు. పోలీసు శాఖలో సుదీర్ఘంగా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఏ ఉద్యోగికై నా పదవీ విరమణ తప్పదన్నారు. అనంతరం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ 41 ఏళ్ల పాటు పోలీసు శాఖలో ఉంటూ ప్రజలకు విధుల పరంగా సహాయ సహకారాలు అందించానన్నారు. తన ఉద్యోగ కాలంలో సహకరించిన ఉన్నతాధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోశ్ కుమార్, ఎస్‌ఐ సాజిద్ తదితరులు ఉన్నారు.
తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం