
ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం
యాలాల: కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు తగిన పదవి ఇచ్చి న్యాయం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్‌మహరాజ్, అధికార ప్రతినిధి నరేందర్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు పాత, కొత్త తేడా లేకుండా పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సూచించిన వారికే ఎంపీటీసీ, సర్పంచ్ టిక్కెట్లు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం పార్టీ కమిటీల్లో భాగంగా పదవులను ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ అధ్యక్షుడు భీమప్ప, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ సర్పంచ్‌లు శ్రీనివాస్, మధుసూదనరెడ్డి, బస్వరాజ్, భీమప్ప, ఏఎంసీ డైరెక్టర్లు నర్సింలుగౌడ్, రాజు, మొగులయ్య, శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్‌గౌడ్, అమృతప్ప, సత్యనారాయణరెడ్డి, రవినాయక్ తదితరులు ఉన్నారు.
డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి