
ఘనంగా సత్యసాయి శత జయంతి
పరిగి: మండల పరిధిలోని రంగాపూర్ శ్రీ సత్యసాయి సేవా సమితి కేంద్రంలో ఆదివారం శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నామ సంకీర్తనను పుర వీధుల గుండా నిర్వహించారు. ఉత్సవాలల్లో భాగంగా టైలరింగ్ శిక్షణ పొందిన 108 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్‌లను అందజేశారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రావు మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాబా ఆశిస్సులతో నిత్యం ప్రజలకు సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.