
హెల్మెట్ తప్పనిసరి
తుర్కయంజాల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ అన్నారు. పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్‌లో శుక్రవారం సీఐ గురునాయుడుతో కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడ్డప్పుడు తలకు బలమైన గాయాలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. అనంతరం హెల్మెట్ లేకుండా సాగర్ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి చలాన్లకు బదులు కొత్త వాటిని కొనుగోలు చేయించారు. ఆయన వెంట ఎస్‌ఐ సాయినాథ్ ఉన్నారు.