
హకీంపేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు
దుద్యాల్: మండలం ఏర్పాటయ్యి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఇంటర్మీడియట్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. 6 నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి హకీంపేట్‌కు ఇంటర్ కళాశాల మంజూరు చేశారు. దీంతో గ్రామంలోని గోశాల సమీపంలో తాత్కాలికంగా కళాశాల కోసం మూడు గదులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత అకాడమీక్ సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులకు గాను సిబ్బంది అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంపీసీ–10, బైపీసీ–32, సీఈసీ–16, హెచ్‌ఈసీ–06, ఎంఎల్‌టీ–05, ఎంపీహెచ్‌డబ్ల్యు–11 సీట్లను బర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.