
కిలోన్నర గంజాయి పట్టివేత
తాండూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రఫీక్ అనే వ్యక్తి కొంత కాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి పలువురికి విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం స్థానిక విలియంమూన్ గ్రౌండ్ సమీపంలో స్థానిక పోలీసులతో కలిసి రఫీక్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎమర్జెన్సీ..స్వేచ్ఛకు చీకటి దినం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రమేష్ కుమార్
తాండూరు టౌన్: నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు చీకటి దినమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. బుధవారం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సమయంలో జైలు జీవితం గడిపిన పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆనాటి చీకటి దినాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ అత్యవసర పరిస్థితి విధించి, అప్పటి ప్రధాని ఇందిరాగాంఽధీ, ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేసి.. అనేక మందిని అకారణంగా జైల్లో పెట్టిందన్నారు. అప్పటి చీకటి రోజులు తిరిగి రాకూడదని, రాజ్యాంగం అమలు పకడ్బందీగా జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ సందర్భంగా జైలుకు వెళ్లిన ప్యాట నారాయణరెడ్డి, కె.నర్సిరెడ్డి, జి.ప్రభులింగం, ఆలంపల్లి రాంరెడ్డి, ఖాంజాపూర్ రాంరెడ్డి, దోర్నాల అనంతరెడ్డి తదితరులను ఘనంగా సన్మానించామన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, శాంత్‌కుమార్, లలిత, భద్రేశ్వర్, చంద్రశేఖర్, గౌరీ శంకర్, పటేల్ విజయ్, సుదర్శన్ గౌడ్, జగదీష్ యాదవ్, దోమ కృష్ణ, ప్రకాష్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.
రేపు రెండో విడత కౌన్సెలింగ్
అనంతగిరి: డీసెట్ – 2025 ధ్రువపత్రాల పరిశీలనకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జూన్ 27న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా వెబ్ కౌన్సెలింగ్ 28 నుంచి 30వ తేదీ వరకు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 944107 1533లో సంప్రదించాలన్నారు.
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
ఏడీఏ పద్మావతి
యాచారం: విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో రైతులను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతి హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ధరకు విత్తనా లు, ఎరువులు అమ్ముతున్నారు, ధరలు ఎలా ఉన్నా యి, రైతులకు రసీదులు ఇస్తున్నారా.? కాలం చెల్లిన విత్తనాలను, ఎరువులను రైతులకు విక్రయిస్తున్నా రా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారులు అధిక లాభార్జన ఆశతో రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లపై రైతులకు వెంటనే రసీదులు ఇవ్వాలని సూచించారు. స్టాక్‌బోర్డులు, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు.

కిలోన్నర గంజాయి పట్టివేత

కిలోన్నర గంజాయి పట్టివేత