
క్షతగాత్రులను పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న సీఐ
షాబాద్: మండలంలోని సీతారాంపూర్‌లో గురు వారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో భక్తుల కోసం వేసిన టెంటు సుడిగాలికి కూలిపోయింది. దీంతో టెంటు రాడ్లు పడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చందనవెళ్లి గ్రామానికి చెందిన అనుసుజాకు తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. పోతుగల్ గ్రామానికి చెందిన అండాలు తలకు, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మరావుగూడకు చెందిన బుచయ్యకు రక్త గాయలు అయ్యాయి. మరికొంత మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.క్షతగాత్రులను షాబాద్ సీఐ గురువయ్య గౌడ్, ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
టెంటు కూలి ముగ్గురికి తీవ్ర గాయాలు
పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

టెంటు కూలడంతో సొమ్మసిల్లి పడిపోయిన మహిళ