
పట్టుబడిన చైన్‌స్నాచర్
సత్యవేడు: వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకుని పారిపోతున్న దుండగుడిని స్థానిక యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు పంచాయతీ పరిధిలోని పాపానాయుడు పేట వీధిలో కే.నాగమ్మ(85) మంగళవారం ఉదయం మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఈమె పరిస్థితి గమనించిన తమిళనాడులోని నేమళ్లూరుకు చెందిన ఈ.ప్రదీప్ వెంబడించాడు. పాపానాయుడు వీధి సమీపంలో జనసంచారం తక్కువ ఉండడంతో ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని పరుగు తీశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంబడింయి చాముండేశ్వరి థియేటర్ సమీపంలో పట్టుకొని, ఎస్‌ఐ రామస్వామికి అప్పగించారు. బాధితురాలికి బంగారు గొలుసును అప్పగించారు. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న యువకుడు జగన్‌ను పోలీసులు అభినందించారు.