Upasana Konidela has taken COVID-19 vaccinated In Apollo Hospitals- Sakshi
Sakshi News home page

కోవిడ్‌ టీకా తీసుకున్న ఉపాసన

Jan 28 2021 4:44 PM | Updated on Jan 28 2021 7:24 PM

Upasana Konidela Take Covid Vaccine At Apollo Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌ని తొలుత వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. నేటి నుంచి ప్రైవేట్‌ రంగంలోని వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో అపోలో లైఫ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, బీ పాజిటివ్‌ మ్యాగ్‌జైన్‌ ఎడిటర్‌, మెగాస్టార్‌ కోడలు ఉపాసన కొణిదెల గురువారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. టీకా‌పై భయాలను తొలగించేందుకు గాను ఆమె అపోలో సిబ్బందితో కలిసి వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిపారు.(చదవండి: 50 కోట్ల మంది కోసం.. ఉపాసన సరికోత్త ఆలోచన)

అంతేకాక జనాలు వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు, భయాలు పెట్టుకోకుండా టీకా తీసుకోవాలని ఉపాసన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇక అపోలో హాస్పిటల్‌ వ్యవస్థాపకులు, పద్మ విభూషణ్‌ అవార్డుగ్రహీత ప్రతాప్‌ సి. రెడ్డి తొలి రౌండ్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement