అనేక చోట్ల భారీ వర్షం
గడిచిన 24 గంటలలో చైన్నె, శివారు జిల్లాల పరిధిలో భారీ వర్షం పడింది. 30 చోట్ల భారీగా, ఐదు చోట్ల అతిభారీగా వర్షం పడింది. అత్యధికంగా ఎన్నూరులో 26 సెం.మీ, బ్రాడ్ వేలో 25 సెం.మీ, ఐస్ హౌస్‌లో 22 సెం.మీ, మనలి, పొన్నేరిలో 21 సెం.మీ, పెరంబూరులో 20 సెం.మీ వర్షం పడింది. రెడ్ హిల్స్, విమ్కో నగర్‌లో 19 సెం.మీ, వడపళణిలో 18 సెం.మీ వర్షం పడింది. అతిభారీ, భారీ వర్షాలు పడ్డ ప్రాంతాల పరిసరాలలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఉత్తర చైన్నెలోని వ్యాసార్పాడి సత్యమూర్తి నగర్, ముల్‌లై నగర్‌లో నీట మునిగాయి. ఇళ్లలోకి సైతం నీళ్లు చేరడంతో అక్కడి ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో కొడుంగయూరు కాలువలోకి నీళ్లు వెళ్ల లేని పరిస్థితులలో ఈ రెండు ప్రాంతాలను వరదలు ముంచెత్తినట్టు అధికారుల పరిశీలినలో తలింది. ఇక్కడ నీటి తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆవడి, అంబత్తూరు, కొండి తోపు, పటాలం, తిరువొత్తియూరు, ఎన్నూరు, బ్రాడ్ వే, పురసైవాక్కం, నుంగంబాక్కం, కోడంబాక్కం, శాంతోమ్, మైలాపూర్, వేళచ్చేరి పరిసరాలలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో యుద్ధ ప్రతిపదికన తొలగించారు. వర్షాలు తెరపించి తెరపించి కొనసాగుతుండటంతో ముంపును ఎదుర్కొవాల్సి ఉంటుందన్న ఆందోళనతో వేళచ్చేరి పరిసరాలతో పాటూ పలు చోట్ల పరిసర వాసులు తమ వాహనాలను వంతెనకు పక్కగా పార్కింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అనేక చోట్ల భారీ వర్షం


