కలైంజ్ఞర్ కలం అవార్డు ప్రదానం
సాక్షి, చైన్నె : 2024 సంవత్సరానికి గాను కలైంజ్ఞర్ కలం అవార్డును ప్రముఖ తమిళ పత్రిక దినతంది సంపాదకులు డిఈఆర్ సుకుమార్‌కు ప్రదానం చేశారు. జర్నలిజం రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును మంగళవారం సచివాలయంలో సీఎం స్టాలిన్ అందజేశారు. 2021–22 నుంచి న్యూస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గ్రాంట్స్ స్కీమ్ ద్వారా సామాజిక సేవ, జర్నలిజం రంగంలో అణగారిన ప్రజల కృషికి దోహ పడిన అత్యుత్తమ జర్నలిస్టుకులకు కలైంజ్ఞర్ కలం అవార్డును ప్రదానం చేస్తూ వస్తున్నారు. తాజాగా 2024 సంవత్సరానికి గాను దినతంది పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ సుకుమార్‌కు అందజేశారు. అలాగే, రానున్న కాలంలో మహిళా జర్నలిస్టుకు సైతం ఈ అవార్డు అందజేయడానికి నిర్ణయించారు. అనంతరం కామరాజర్ నగర్‌లో రూ. 39.30 కోట్లతో తమిళనాడు స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల తరహా గృహాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సమాచార శాఖమంత్రి స్వామినాధన్, సీఎస్ మురుగానందం, సమాచార కార్యదర్శి కె. రాజారామన్, డైరెక్టర్ సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వీరమణికి సత్కారం
ద్రావిడ కళగం నేత కె వీరమణి సీనియర్ రాజకీయ నాయకులు అన్న విషయం తెలిసిందే. మంగళవారం 93వ వసంతంలోకి ఆయన అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రులు నెహ్రూ, ఎం. సుబ్రమణియన్, అన్బిల్ మహేశ్‌తో కలిసి స్వయంగా వీరమణి నివాసానికి సీఎం స్టాలిన్ వెళ్లారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ఆయన సేవలు, ప్రయాణాన్ని వివరిస్తూ ఎక్స్ పేజీలో సీఎం ట్వీట్ కూడా చేశారు.
కలైంజ్ఞర్ కలం అవార్డు ప్రదానం


