
వైభవంగా రథోత్సవం
కార్వేటినగరం: మహా భారత వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి అర్చనలు అభిషేకాల అనంతరం ద్రౌపదీ, ధర్మరాజులకు ఉభయదారులు కరణీకులు సమర్పించిన పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. అలాగే కరణీక కులస్తులు నూతనంగా నిర్మించిన రథంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, బాణసంచా మోత నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఉప్పు, మిరియాలు చల్లుతూ మొక్కులు చెల్లించారు. అలాగే ఇంటింటా కర్పూర నీరాజనాలు సమర్పించారు. భాగవతారిణి రెడ్డెమ్మ హరికథాగానం చేశారు. మధ్యాహ్నం వెంకటేశ్వర ఆటో యూనియన్ భక్తులకు అన్నదానం చేసింది. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు రవియాదవ్, ప్రధాన కార్యదర్శి గౌతంరాజు, అర్చకులు సుమన్‌యాదవ్, పలువురు భక్తులు పాల్గొన్నారు.
నేడు అర్జున తపస్సు
శుక్రవారం ఉదయం 8 గంటలకు నఽంది వాహనంపై స్వామివారి ఊరేగింపు, మధ్యాహ్నం 12 గంటలకు అర్జున తపస్సు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అర్జున తపస్సు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు.