
● ఆళ్వార్‌పేటలో స్వయంగా సభ్యత్వం నమోదు ●రాష్ట్రవ్యాప్తం
సాక్షి, చైన్నె: 2026 లో మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో ప్రజల్ని ఏకం చేసే విధంగా 45 రోజుల ప్రచార పర్యటన, సభ్యత్వ నమోదుకు ఈనెల ఒకటో తేదీన చైన్నెలో స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ 45రోజుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలోని 38 జిల్లాలలో ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల కార్యదర్శులు బుధవారం మీడియా ముందుకు వచ్చి ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ ప్రగతిని వివరించారు. ఇక, పార్టీ పరంగా ఉన్న 78 జిల్లాలలో ఇంటింటా ప్రచారం, సభ్యత్వ నమోదు ప్రక్రియను గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. కార్యదర్శుల నేతృత్వంలో ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో జిల్లాల వారీగా సభలు ఈ నెల ఏడో తేది నుంచి చేపట్టనున్నారు. 234 నియోజకవర్గాలకు శిక్షణ పొందిన ఐటీ విభాగం ఇన్‌చార్జ్‌లు, 68 వేల పోలింగ్ బూత్‌కమిటీలు, డిజిటల్ ఏజెంట్లు ప్రజల్ని కలిసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఎంకే నాయకులు అందరూ ఉరకలు పరుగులతో తొలి రోజున ప్రచారం, సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టారు.
ఆళ్వార్ పేటలో..
చైన్నెలోని ఆల్వార్‌పేట ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ ఒకే జట్టుగా తమిళనాడు ఉద్యమానికి ప్రజా మద్దతును సేకరించే దిశగా గురువారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ శ్రీఓరనియిల్ తమిళనాడ్ఙు ఉద్యమంలోకి ప్రజలను ఆహ్వానిస్తూ ఇంటింటా పర్యటించారు. ఈ సమయంలో స్టాలిన్‌కు జనం బ్రహ్మారథ పడుతూ కరతాళ ధ్వనులను మార్మోగిస్తూ ఆహ్వానాలు పలికారు. ఈ జట్లలతో తామంతా మీ వెన్నంటే అంటూ జనం నినాదించారు. మహిళ, విద్య, పారిశ్రామిక ప్రగతి గురించి ప్రజలు సీఎంకు వివరిస్తూ అభినందించడం విశేషం. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రజలతో ముచ్చటించారు. ఓ ఫాంను అందజేసి, అందులోని ప్రశ్నలను సంధించి ప్రజలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. తమిళనాడులో పాలన కొనసాగాలని ఆశిస్తూ, ప్రజలు సంకల్పంతో సభ్యత్వ నమోదు చేసుకుంటుండడం చూస్తే, ఈ ఉద్యమం బ్రహ్మాండ విజయాన్ని చేజిక్కించుకోవడం ఖాయం అని ఈ సందర్భంగా స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. జూలై ఒకటో తేదీన ఒకే జట్టుగా తమిళనాడ ప్రచారాన్ని ప్రారంభించానని, ప్రజల నుంచి అఖండ మద్దతు లబిస్తుండటం ఆనందంగాఉందన్నారు. శ్రీతమిళ భూమి, భాష, హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి కులం, మతం రాజకీయాలకు అతీతంగా తమిళనాడును మళ్లీ గెలిపించుకుందామని వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులు, నేత కార్మికులు మొదలైన వారి ప్రయోజనాలను పరిరక్షించే కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటామన్నారు. పిల్లలను కనే విషయంగా ఓ ప్రశ్నను స్టాలిన్ సందించగా, అక్కడున్న వారు.. అవును... అవును.. అని నినదించారు. తన పర్యటనలో భాగంగా మరో వీఽధిలోకి వెళ్లగా అక్కడి ప్రజల ఆనందానికి అవదులు లేదన్నట్టుగా పరిస్థితి నెలకొంది.
ట్వీట్‌తో ఆనందం
తన ఇంటింటా ప్రచార పర్యటన గురించి స్టాలిన్ ట్వీట్ చేశారు. ప్రజలు ప్రశ్నలు అడగాన్నే చటుక్కున సమాధానాలు ఇవ్వడమే కాదు, మరింతగా విస్తృతం చేయాలని, పాలన కొనసాగాలని ఆకాంక్షించడం మరింత ఆనందాన్ని కలిగించిందని వివరించారు. యువతే దేశ భవిష్యత్తు సంపద అని, వారి భవిష్యత్తును కాపాడటం మన కర్తవ్యం అని వ్యాఖ్యలు చేశారు. చాలా అప్రమత్తంగా ఉండడం చూసి, ప్రజలే మార్గనిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను సందించిన పలు ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన సమాధానాలను గుర్తు చేస్తూ, తామున్నామని ప్రజలే మద్దతు ఇస్తున్నారని, ఎల్లప్పుడూ భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తమిళనాడు నిలవాలని ఆకాంక్షిస్తున్నారని, అందరం ఐక్యంగా ఉంటామని పేర్కొంటుండటం బట్టి చూస్తే ఈ ఉద్యమం రాబోయే విజయానికి (2026 ఎన్నికలకు) సంకేతంగా అభివర్ణించారు. సీఎంతో పాటూ ఇంటింటా ప్రచారానికి వెళ్లిన వారిలో పార్టీ నిర్వాహక కార్యదర్శి, మంత్రి ఎం సుబ్రమణియన్, పార్టీ స్థానిక నేతలు కలై, నందనం మది ఉన్నారు.
రూ. 52 కోట్లతో ఆరోగ్య కేంద్రాలు
తరమణిలో తమిళ నాలెడ్జ్ సెంటర్
సాక్షి, చైన్నె: ప్రజా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కొత్త ఆరోగ్య కేంద్రాల ఏర్పాటును విస్తృతం చేశారు. ఇందులో భాగంగా రూ. 52 కోట్ల వ్యయంతో 208 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రూ. 60 కోట్లతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. వీటిని సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ప్రారంభించారు. వైద్య, ప్రజారోగ్య శాఖ తరపున చైన్నె అడయార్‌లోని శాస్త్రి నగర్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడులోని కార్పొరేషన్ , మునిసిపాలిటీ పరిధిలోని ప్రాంతాలలో రూ. 52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 208 కొత్త పట్టణ కేంద్రాలను ప్రజల ఉపయోగానికి తీసుకొచ్చారు. వెల్‌నెస్ కేంద్రాలను సీఎం ప్రారంభించారు. అలాగే రూ. 60 కోట్లతో నిర్మించిన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభించారు. తమిళనాడు ప్రజలకు ఉన్నత–నాణ్యత వైద్య సదుపాయాలను అందించడానికి, కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం వేగం పెంచినట్టు ఈసందర్భంగా సీఎం ప్రకటించారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ సహా 21 మున్సిపల్ కార్పొరేషన్లు , 63 మున్సిపల్ ప్రాంతాల్లో రూ. 177 కోట్ల అంచనా వ్యయంతో 708 కొత్త పట్టణ ఆరోగ్య కేంద్రాలు. ఏర్పాటు చేస్తామని ప్రకటించామని గుర్తు చేశారు. అలాగే చైన్నెలోని తారామణిలో తమిళ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. చైన్నెలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనులను ప్రారంభించారు. తారామణిలోని రోజా ముత్తయ్య పరిశోధన గ్రంథాలయం తరపున తమిళ ప్రజల కోసం సాంస్కృతిక కేంద్రంగా పనిచేసే శ్ఙ్రీతమిళ జ్ఞాన సముదాయంశ్రీ (తమిళ్ నాలెడ్జ్ సెంటర్) క్యాంపస్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ నిర్మాణాలకు 30,000 చదరపు అడుగుల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ. 40 కోట్లతో పనులు చేపట్టారు.

● ఆళ్వార్‌పేటలో స్వయంగా సభ్యత్వం నమోదు ●రాష్ట్రవ్యాప్తం