
10న వినూత్న నిరసన
● ఆవులు, మేకలతో సీమాన్ భేటీ
సాక్షి, చైన్నె : నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వినూత్న రీతిలో ఆవులు, మేకలతో కలిసి ఓ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10వ తేదీన మదురైలో ఈ సమావేశం జరగనుంది. సీమాన్ ఇటీవల కాలంగా సేంద్రీయ వ్యవసాయం, తాటి కల్లు అమ్మకాలకు అనుమతి, ఆవులు,మేకలుగురించి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తనకు అధికారం ఇస్తే,మేకలు,ఆవుల పెంపకంను ప్రభుత్వ ఉద్యోగంగా మార్చేస్తానని పేర్కొంటున్నారు. రైతులకు మద్దతుగా సీమాన్ చేస్తూ వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా గురువారం ఓ వీడియో విడుదల చేశారు.ఇందులో అన్నదాతకు మద్దతుగా, పాలకులకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు సిద్దమయ్యారు. ఈనెల 10వ తేదిన మదురై విరగనూర్ వేదికగా ఆవులు, మేకలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నామని ప్రకటించారు.పార్టీ వర్గాలు తప్పని సరిగా, ఆవులు, మేకలతో ఈ సమావేశానికి తరలి రావాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం.