క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 4 2025 6:45 AM | Updated on Jul 4 2025 6:45 AM

క్లుప

క్లుప్తంగా

మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచారం

యువకుడి అరెస్ట్‌

తిరువొత్తియూరు: వృద్ధురాలిపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ధర్మపురి జిల్లా తోప్పూర్‌ సమీపంలోని మెల్పురికల్‌ ప్రాంతానికి చెందినవారు సురేష్‌ (26) పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి అదే ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న 75 ఏళ్ల మహిళ ఇంటిలోకి మద్యం మత్తులో చొరబడి ఆమైపె అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని బంధువులు బుధవారం ఉదయం ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సురేష్‌ను అరెస్టు చేశారు.

పెరుంగుడిలో సంచలనం

వివాహేతర ప్రియుడిని కత్తితో పొడిచిన మహిళ

తిరువొత్తియూరు: చైన్నెలోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన శక్తివేల్‌ కారు డ్రైవర్‌. ఇతడు తన భార్యతో విడిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా గత వారం శక్తివేల్‌ తల్లిదండ్రులు దిండివనంకు పిల్లలను తీసుకెళ్లారు. ఈక్రమంలో శక్తివేల్‌కు పక్కఇంటిలో వుంటున్న వారు దిండివనంలో ఉన్న అతడి తండ్రికి ఫోన్‌ చేసి, మీ కుమారుడి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారని చెప్పారు. దీంతో వేలచేరిలోని బంధువులు అతనిని చూడటానికి వచ్చారు. తీవ్ర గాయాలతో అక్కడే పడి ఉన్న శక్తివేల్‌ను వారు రక్షించి, చికిత్స కోసం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. డ్రైవర్‌ శక్తివేల్‌ శరీరంపై మొత్తం 16 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటనపై దురైపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళకు, డ్రైవర్‌ శక్తివేల్‌కు మధ్య వివాహేతర సంబంధం నడుస్తోందిని తెలిసింది. శక్తివేల్‌ ఆ మహిళను తరచూ వేధిస్తున్నాడని ఈ కారణంగానే బుధవారం రాత్రి వివాహేతర ప్రియుడి ఇంటికి వెళ్లిన సదరు మహిళ కత్తితో పదే పదే పొడిచి పారిపోయిందని తెలిసింది. దీని తరువాత, పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఏటీఎం కార్డు సాయంతో వినూత్న చోరీ

యువకుడి అరెస్టు

పళ్లిపట్టు : ఏటీఎం కార్డు ఉపయోగించి వినూత్న రీతిలో డబ్బులు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కేశవరాజుకుప్పం గ్రామానికి చెందిన కృష్ణన్‌(55 )రైతు అతను నాలుగు రోజుల కిందట పొదటూరుపేటలోని ఇండియన్‌ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు అక్కడున్న వ్యక్తి సాయం కోరాడు. తన అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని రైతు కోరగా సాయం చేసే విధంగా నమ్మించి ఏటీఎం కార్డు పనిచేయడం లేదని. కార్డు మార్చి ఇచ్చి అసలు కార్డు తీసుకెళ్లిన వ్యక్తి కొద్ది సేపటికి ఆ ఏటీఎం కార్డు ఉపయోగించి రూ. 42 వేలు డ్రా చేశాడు. ఈ మేరకు పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా నగరి సమీపం కేవీఆర్‌పీ పేటకు చెందిన అరుణ్‌కుమార్‌ (32)ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

వైద్యులు సేవాభావం కలిగి ఉండాలి

వేలూరు: వైద్యులు నిరుపేద రోగుల పట్ల సేవా భావాన్ని కలిగి ఉండాలని కాట్పాడి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ కార్యదర్శి జనార్ధనన్‌ అన్నారు. జాతీయ డాక్టర్‌ల దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం ఉదయం కాట్పాడి సమీపంలోని తిరువలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెడ్‌క్రాస్‌ సంఘం అద్వర్యంలో డాక్టర్‌ల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్‌లచే కేక్‌ కట్‌ చేసి సన్మానించారు. అనంతరం డాక్టర్‌లు రాణి నిర్మల, దీనబందు తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ గౌరవాధ్యక్షులు శివసుబ్రమణ్యం, ఉపాద్యక్షులు శ్రీనివాశన్‌, కోశాధికారి పయణి, రమేష్‌కుమార్‌ జైన్‌, డాక్టర్‌లు ప్రియ, నికిల్‌ ప్రశన్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గింజ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి

అన్నానగర్‌: మేలపాలైయంలో రంబుటాన్‌ విత్తనం గొంతులో ఇరుక్కుపోయి 5 ఏళ్ల బాలుడు మరణించాడు. వివరాలు.. నైల్లెలోని మేలపాళయం వీధికి చెందిన నిజాం కుమారుడు రియాజ్‌ (5). ఇతను బుధవారం రాత్రి తన తాతా, అమ్మమ్మ కొనిచ్చిన రాంబుటాన్‌ పండ్లను తింటున్నాడు. పండు మింగిన కొన్ని నిమిషాల్లోనే, ఆ విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో రియాజ్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. బంధువులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే రియాజ్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనపై మేలపాళయం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement