
వడకుప్పంలో వేడుకగా అర్జున తపస్సు
పళ్లిపట్టు: వడకుప్పంలో ద్రౌపదీ దేవి ఆలయ వేడుకల్లో భాగంగా బుధవారం అర్జున తపస్సుమాను నాటకం వేడుక నిర్వహించారు. వడకుప్పంలోని ద్రౌపదీదేవి ఆలయంలో వార్షిక అగ్నిగుండ వేడుకలు జూన్ 26న ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రోజూ అమ్మవారు గ్రామ వీధుల్లో ఊరేగుతున్నారు. ప్రతిరోజూ పగలు మహాభారత హరికథా గానం, రాత్రి వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన అర్జున తపస్సుమాను నాటకం ఆకట్టుకుంది. వడకుప్పం చుట్టు పక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్జునుడు వేషధారణ చేసి, కళాకారుడు తపస్సుమాను ఎక్కి పాటలు పాడుతూ పరమేశ్వరుడి వద్ద వరం కోరే ఘట్టం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంతానం లేని మహిళలు సంతాన ప్రాప్తి కోసం తపస్సుమాను కింద పడుకుని వేడుకున్నారు. చివరగా అర్జున వేషదారి మహిళలపై నిమ్మపండ్లు సహా పూజా సామగ్రి విసరడంతో వాటిని తీసుకోవడానికి వాటిని స్వాకరించేందుకు పోటాపోటీ పడ్డారు. వేడుకల్లో ప్రధానమైన అగ్నిగుండ వేడుకలు ఆదివారం నిర్వహిస్తారు.