
ఈఎన్‌టీ నైపుణ్యాల అభివృద్ధే లక్ష్యం
సాక్షి, చైన్నె : ఈఎన్‌టీ నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఆర్‌హెచ్‌ఐఎంఈఎస్ 2025 కాడవెరిక్ ప్రదర్శన చైన్నె శివారులోని కాటాన్ కొళత్తూరులో జరిగింది. ఎస్‌ఆర్‌ఎం వైద్య కళాశాల ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ఈఎన్‌టీ విభాగం, అనాటమీ విభాగం సహకారంతో రెండురోజుల పాటుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈఎన్‌టీ ప్రొఫెసర్ డాక్టర్ సీఆర్‌కే బాలాజీ , అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ సుందర పాండ్యన్ మార్గదర్శకంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యా పరమైన అంశాలు, క్లినికల్ నైపున్యాల గురించి చర్చించారు. ఈఎన్‌టీ నిపుణులతో విశిష్ట ప్యానెల్ ప్రతినిధులు పద్మశ్రీ డాక్టర్ మోహన్ కామేశ్వరన్, ఎంఈఆర్‌ఎఫ్ ఎండీ డాక్టర్ రెగి థామస్, సీఎంసీ వేలూరు ప్రొఫెసర్ డాక్టర్ రఘునందన్, డాక్టర్ వివేక్, డాక్టర్ నితిన్ ఎం నగర్కర్‌లు వివిధ సెషన్లలో రైనాలజీ రంగంలో తాజా ధోరణులు, శస్త్ర చికిత్సలు, ఆవిష్కరణల గురించి చర్చించారు. అధునాతన ప్రదర్శనలు అందించారు. ఆచరణాత్మక శిక్షణతో పాటుగా వర్క్‌షాపులో విద్యా అంశాలను విశదీకరించారు.