
ఇంటి వద్దకే రేషన్..!
● ప్రయోగాత్మకంగా అమల్లోకి
సాక్షి, చైన్నె: ఇంటి వద్దకే రేషన్ నినాదంతో నిత్యావసర వస్తువులను దరిచేర్చే బృహత్తర పథకానికి ప్రయోగాత్మకంగా బుధవారం శ్రీకారం చుట్టారు. చైన్నెలో వేళచ్చేరితో పాటూ పలు చోట్ల ఇంటి వద్దకే వెళ్లి రేషన్ వస్తువులను వృద్ధులు, దివ్యాంగులకు అందజేశారు. వివరాలు.. రాష్ట్రంలో 2.25 కోట్ల రేషన్‌కార్డులు ఉన్న విషయం తెలిసిందే. బియ్యం కార్డు దారులకు ఉచితంగా బియ్యం, చక్కెర , పామోలిన్, కంది పప్పు తదితర వాటిని చౌక ధరకే అందిస్తూ వస్తున్నారు. ఈకార్డు దారులను బయోమెట్రి క్ లేదా, ఐరీష్ ఆధారంగా గుర్తించి నిత్యవసర వస్తువుల పంపిణి సుమార 35 వేల మేరకు ఉన్న రేషన్ దుకాణాల ద్వారా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ వస్తువుల పంపిణిని విజయవంతం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం పరిగణించింది.దాపి ఆధారంగా తమిళనాడులోనూ ఈ విధానం అమలు చేయడానికి సీఎంస్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, అమల్లోకి తీసుకు రావడంలో జాప్యం తప్పలేదు.
తొలివిడతగా 10 జిల్లాల్లో..
ఎట్టకేలకూ ఇంటి వద్దకే రేషన్ వస్తువుల పంపిణీకి చర్యలు చేపట్టారు.అయితే, ప్రయెగాత్మకంగా అమలు చేయడానికి తొలుత వృద్ధలు, దివ్యాంగులైన కార్డుదారుల వివరాలను సేకరించారు. సమారు 15 లక్షలమంది కార్డుదారులుగా ఉన్నట్టు గుర్తించారు. వీరికి ఇళ్ల వద్దకే తీసుకెళ్లి రేషన్ వస్తువులనుఅందజేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. తొలి విడతగా పది జిల్లాలలో ఇంటి వద్దకే రేషన్ అమల్లో భాగంగా బుధవారం ప్రయోగాత్మకంగా చైన్నె వేళచ్చేరి పరిసరాలలో ఇంటి వద్దకే వాహనల ద్వారా రేషన్ వస్తువులను తీసుకెళ్లి లబ్దిదారులకు అందజేశారు. రేషన్ దుకాణాలలో క్యూలో నిలబడాల్సిన అవశ్యం లేకుండా తమ ఇళ్ల వద్దకే తీసుకొచ్చి నిత్యవసర వస్తువులను అందజేయడానికి వృద్ధులు, దివ్యాంగులు ఆహ్వానించారు. ఈ ప్రయోగాత్మకంగా పూర్తి స్థాయిలో విజయవంతం కాగానే, రాష్ట్రంలో పది జిల్లాలో అమలు చేయనున్నారు. ఆతదుపరి క్రమంగా అందరు రేషన్‌కార్డు దారులకు ఇళ్ల వద్దకే నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే విధంగా మొబైల్‌వాహనాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించే విధంగా ప్రభుత్వ విస్తృత కార్యచరణ పై దృష్టి పె ట్టింది.