బాలికపై అత్యాచారం | - | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం

Jul 2 2025 5:36 AM | Updated on Jul 2 2025 5:36 AM

బాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారం

50 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు

కొరుక్కుపేట: మైనర్‌ బాలికపై అత్యాచారం చేసినందుకు ఓ తాతకు తంజావూరు పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని వల్లం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై 2022 మార్చి 29న 50 ఏళ్ల తనీష్‌ రాజ్‌ అత్యాచారం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీని తరువాత తనీష్‌ రాజ్‌ను పోక్సో కేసులో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తంజావూరు పోక్సో కోర్టులో సాగింది. సోమవారం తుది తీర్పు వెలువడింది. నిందితుడు తనీష్‌ రాజ్‌కు న్యాయమూర్తి తమిళరసి జీవిత ఖైదు విధించారు. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారం అందించాలని కూడా ఆమె ఆదేశించారు.

స్థానిక సంస్థల్లో నియమిత సభ్యులుగా దివ్యాంగులు

ఈనెల 17 వరకు దరఖాస్తులు

కొరుక్కుపేట: స్థానిక సంస్థల్లో దివ్యాంగుల గొంతు వినిపించాలనే ఆలోచన ఆధారంగా తమిళనాడు శాసనసభ 1994 పంచాయితీ చట్టం, 1998 తమిళనాడు పట్టణ పంచాయతీ చట్టాన్ని సవరించి పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయితీలలో ఓ దివ్యాంగుడిని నామినేటెడ్‌ సభ్యుడిగా నియమించడానికి ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించింది. దీని ప్రకారం పట్టణ స్థానిక సంస్థల విషయంలో కార్పొరేషన్‌ కౌన్సిల్‌కు, పట్టణ మండలికి, స్థానిక సంస్థల్లో ఒక్కో దివ్యాంగ సభ్యుడిని నియమించాలని చట్టం చేశారు. దీని ద్వారా 13,357 దివ్యాంగుల వ్యక్తులు స్థానిక సంస్థల్లో సభ్యులుగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు నియమిస్తామని డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థల్లో 650 మంది దివ్యాంగులను వెంటనే నియమిస్తారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 2,984 మంది దివ్యాంగులను నియమిస్తారు. దీని ప్రకారం మంగళవారం నుంచి దివ్యాంగుల నియమిత సభ్యులుగా చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చునని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని సమర్పించగలరి కేరింది. మరిన్ని వివరాల కోసం tn.gov.in/dtp వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.

తిరుత్తణి మురుగన్‌ ఆలయం హుండీ కానుక రూ.2.20 కోట్లు

తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 38 రోజుల్లో భక్తులు రూ.2.20 కోట్లు కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. భక్తులు తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో నగదు, నగలు కానుకలుగా చెల్లిస్తుంటారు. భక్తులు చెల్లించిన కానుకలను ఆలయ అధికారుల సమక్షంలో హుండీలు తెరిచి కానుకలు లెక్కించడం పరిపాటి. చివరి 38 రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలు లెక్కింపు సోమవారం చేపట్టారు. ఆలయ జాయింట్‌ కమిషనర్‌ రమణి సమక్షంలో హుండీలు తెరిచి ఆలయంలోని వసంత మండపంలో లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది వందకు పైబడిన వారు పాల్గొన్నారు. ఇందులో నగదుగా రూ. రెండు కోట్ల 20 లక్షల 10 వేల 874 రూపాయలు, కేజీ 30 గ్రాముల బంగారం, 18 కేజీల 405 గ్రాముల వెండి భక్తులు కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అమల్లోకి వచ్చిన రైలు చార్జీల పెంపు

కొరుక్కుపేట: దేశవ్యాప్తంగా ఏసీ , స్లీపర్‌, సెకెండ్‌ క్లాస్‌ రైలు చార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. 2013లో కిలోమీటరుకు రెండు పైసలు నుంచి 10 పైసలకు చార్జీలు పెంచారు. అదే విధంగా 2020లో మరోసారి చార్జీలను పెంచారు. తాజాగా 500 కిలోమీటర్లుకు పైగా ప్రయాణించే వారికి రైలు చార్జీలు పెంపు మంగళవార నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం రిజర్వేషన్‌ లేకుండా సాధారణ కోచ్‌లో 501 కిలోమీటర్లు నుంచి 1500 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ప్రయాణికులకు రూ.5 పెరిగింది. అదే విధంగా 1,501 కిలో మీటర్లు నుంచి 2,500 కిలోమీటర్లు వరకు చార్జీలను రూ.10 పెంచారు. 2,501 కిలోమీటర్లు నుంచి 3,000 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ప్రయాణికులకు రూ.15 పెరిగింది. ఇందులో సాధారణ బెడ్‌ సౌకర్యంతో చైన్నె నుంచి మదురైకి రూ.320, చైన్నె నుంచి తిరుచ్చికి రూ.249, చైన్నె నుంచి కోయంబత్తూరు రూ.330, చైన్నె నుంచి తూత్తుకుడికి రూ.402 , చైన్నె నుంచి నెల్లూరుకు రూ.402, చైన్నె నుంచి కన్యకుమారికి రూ.423, చైన్నె నుంచి నాగర్‌ కోయిల్‌కు రూ.433, చైన్నె నుంచి సేలంకు 259 , చైన్నె నుంచి బెంగుళూరుకు 269కు టికెట్‌ ధర చేరింది. ఏసీ కోచ్‌లలోనూ ఈమేరకు పెంచినట్టు అదికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement